Saturday, March 15, 2025

‘మాటిచ్చి తప్పితే అంజన్న ఊరుకుంటారా..? అందుకే కవిత జైలుపాలైంది’

కొండగట్టు అంజన్నకు ఇచ్చిన మాటను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తప్పారని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కొండగట్టుపై అతిపెద్ద అంజన్న విగ్రహం పెడతామని మాటతప్పారన్నారు. మాటిచ్చి తప్పితే అంజన్న ఊరుకోరని.. అందుకే లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయి జైలు పాలైందని విమర్శించారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్నను దర్శించుకున్న మంత్రి పొన్నం అనంతరం మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఆ దేవుడిని ప్రార్థించినట్లు చెప్పారు. తమ ప్రజా పాలన ప్రభుత్వమని…ప్రజలకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన వినోద్, సంజయ్‌లు పదేళ్లు కరీంనగర్ ఎంపీలుగా ఉండి నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శించారు గత ఐదేళ్లలో నియోజకవర్గాని ఏం చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘మేం ఏం చేశామో ప్రజలకు చెబుతాం. మీకు ఈ నియోజకవర్గం మీద ప్రేమ ఉంటే ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి. గతంలో కేసీఆర్ కరీంనగర్‌కి వచ్చినప్పుడు నేను పెద్ద యాగాలు చేసిన.. నేనే పెద్ద హిందువునని అన్నారు. దానిని అడ్డం పెట్టుకొని గెలిచారు. కొండగట్టుకి, వేములవాడకి బండి సంజయ్ ఏమైనా చేశారా. బండి సంజయ్ రాముడి ఫోటో కాకుండా నువ్వు చేశావో చెప్పి ఓట్లు అడగు. వినోద్ కుమార్ ఈ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలి.’ అని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు

- Advertisement -

Related Articles

2 COMMENTS

Leave a Reply to Telangana Times Cancel reply

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img