T టైమ్స్ ప్రతినిధి..నా వీడియోను మార్ఫింగ్ చేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అతిపెద్ద తప్పు చేశారు…అని వికారాబాద్ లో బిజేపి ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రేవంత్ రెడ్డి పై త్రీవ్ర స్థాయి లో మండి పడ్డారు. ఫేక్ వీడియోలతో ఎన్నికలు గెలవాలని కుట్రలు చేశారు. తెలంగాణలో నేను మాట్లాడిన మాటలు వక్రీకరించి, మార్ఫింగ్ చేసి, దుష్ప్రచారం చేశారు. ఇలాంటి మోసపూరిత పద్ధతుల్లో ఎన్నికల్లోగెలవాలనుకుంటున్నారు, మీకు ముస్లింల రిజర్వేషన్ రద్దు చెసే దమ్ము మీకుందా ? దమ్ముంటే నిజాయితీగా ముందుకు రండి అంటూ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు.
నేను కేవలం ముస్లిం ల రిజర్వేషన్లు మాత్రమే ఎత్తివేస్తానని చెప్పగా, దాన్ని మార్ఫింగ్ చేసి అన్ని రిజర్వేషన్లు ఎత్తివేస్తానని ప్రచారం చేయడం ఎంత వరకు సమంజసమో ఆలోచించారా ? స్థాయిలో ఉండి ఇలాంటి దుర్మార్గపు పనులు చేయడమేంటి ? అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి మార్ఫింగ్ లు చేయడమెంటి ? అంటూ పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు… సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ జరుగుతుంది..
courtesy znews telugu