Monday, March 10, 2025

తెలంగాణలో కేసీఆర్ భవిష్యత్తు ఏంటి ?

కేసీఆర్ రాజకీయంగా ఎవరితోనూ శత్రుత్వంగానీ, మిత్రుత్వంగానీ శాశ్వతంగా ఉంచుకోరు.   టైం దొరికితే చాలు  అటూ బీజేపీ మీద , ఇటూ కాంగ్రెస్ మీద అగ్గిగుగ్గిలమయే మాజీ సిఎం కేసీఆర్ ఏం చేస్తున్నారు ?  అందరికీ రాజకీయాలంటే గేమ్‌ కావొచ్చు..కేసీఆర్‌కి మాత్రం రాజకీయమంటే ఒక టాస్క్‌. ఈ మాటలు గతంలో స్వయంగా కేసీఆర్‌ చెప్పినవే. కేవలం మాటలు కాదు… రాజకీయాల విషయంలో ఆయన చేతలు కూడq అలానే ఉంటాయి.  ఆనాటి ఉద్యమ సమయం నుంచి మొన్నటి  ఓటమి వరకు … ఆయన రాజకీయ చాణక్యం అలానే ఉండేది. ప్రత్యర్థులకు అంతుచిక్కని పదునైన వ్యూహాలతో… రాజకీయ అపర చాణక్యుడుగా  పేరు గడించారు. 14ఏళ్ల ఉద్యమం నడిపి తెలంగాణను సాధించడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన నాయకుడు..  దాదాపు పదేళ్ల పాటు రాష్ట్రాన్ని  ఒంటి చేత్తో పాలించిన కేసీఆర్‌ నేడు ఎక్కడున్నాడు ? నేడు రాష్ట్రం లో బీ ఆర్ ఎస్ , కాంగ్రెస్ మద్య భారీగా మాటలు తూటాలు పేలుతున్నాయి.., అయినప్పటికీ అసలు  పెద్దసార్‌  ఎందుకు స్పందించడం లేదు  ?  14ఏళ్లు ఉద్యమాన్ని నడిపిన నాయకుడు.. 10ఏళ్లు రాష్ట్రాన్ని ఏలిన నాయకుడు.. ఇప్పుడిలా మౌనవత్రంలోకి వెళ్లడం పార్టీవర్గాలనే కాదు, సామాన్య ప్రజలను సైతం పరేషన్  చేస్తోంది. మ్యాటర్ ఎదైనా సరే  కేసీఆర్‌ అంటేనే  రెఢీ మెడ్ ఫైర్ … అన్నట్టుగా ఉంటుంది ఆయన వ్యవహార శైలి. కానీ, ఇప్పుడిలా  డీలగా, సైలెంట్ గా ప్రజల మధ్యకు రాలేక పోవడం ఆ పార్టీ  అభిమానులకు, నాయకులకు అస్సలే నచ్చటం లేదు.

Part 1.

తెలంగాణ రాష్ట్రం కొన్ని దశాబ్దాల స్వప్నం. అసలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవుతుందా? మనం చూడగలమా? అనుకుంటున్న తరుణంలో తెలంగాణ ఏర్పాటును సాకారం చేశారు కేసీఆర్. తెలంగాణ అనే పదాన్ని పలకడానికి కూడా ఇష్టపడని వ్యక్తుల చేత తన చతురతతో ‘జై తెలంగాణ’ అనిపించారు. తన పార్టీకీ బలం లేకపోయినా, తన మనోబలాన్నే జనబలంగా మార్చుకొని అన్ని పార్టీలకు చెమటలు పట్టించారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, దాదాపు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేసీఆర్ ఇపుడు అనూహ్యంగా  అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోవడమే కాకుండా పార్లమెంట్ ఎన్నికలలో కనీసం ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోవడం దారుణం. ఒకప్పుడు కేసీఆర్ అంటే తెలంగాణ…. తన మాటే అనుకొని ముందు కెళ్లిన  కెసిఆర్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో మీ అందరికీ తెలిసిందే ..ఓడలు బండ్లయితాయి. బండ్లు ఓడలు అవుతాయనే నానుడి నిజమే అనిపిస్తుంది. ఆకాశమే హద్దుగా చెలరేగిన కేసీఆర్ కు  నేల మీద నడవడం ఎంత కష్టమో తెలిసి వస్తుంది.  ఇది కేసీఆర్ తన జీవితకాలంలో ఎన్నడూ కూడా ఊహించలేదు ఇతరుల మీద ఆధారపడడం తెలంగాణ ప్రజలను ఆశ్చర్యచకితులను చేస్తున్నది. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలలో 119 స్థానాలకు 60 స్థానాలు గెలుచు కొని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఎన్నికలలో గెలిచిన ఇతర పార్టీలవారిని భవిష్య త్తులో ఇబ్బందులు కలగకుండా తన పార్టీలో చేర్చుకుని సీఎం కేసీఆర్ మంత్రి పదవులు కట్టబె ట్టారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి 88 స్థానాలు గెలుచుకొని అందరికి షాకిచ్చారు కేసీఆర్. నిజానికి ఆనాడు అన్ని పార్టీలు కలిసి మహాకూటమి పేరుతో పోటీకి నిలవగా, టీఆర్ఎస్ ఒంటరిగానే బరిలోకి దిగింది. అప్పుడు కూడా కేసీఆర్ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేశారు. ఇంత ముందు చూపు ఉన్న కేసీఆర్ నేడు ఎందుకు ఓడిపోయాడు ? ఎందుకు ఒంటరి వాడయ్యాడు ? సొంత కూతురు జైల్లో కటకటాల వెనుక అవస్థలు పడుతుంటే కనీసం ఎందుకు చూడలేకపోయాడు ?  బయటకు వచ్చి మాట్లాడడానికి ఎందుకు ఫీలవుతున్నాడు ? థర్డ్ ఫ్రంట్  అంటూ హంగామా చేసిన కేసీఆర్ నేడు ఎక్కడ ఉన్నాడు ?   నిజంగా తనకి ఇబ్బంది అని తెలిస్తే తన రక్షణ కొరకు ఎలాంటి త్యాగానికైనా సిద్దపడే మనస్తత్వం గల మహా మొండి మనిషి  కేసీఆర్  ! అలాంటి మొండి ఘటం  రాజకీయ వ్యూహంలో భాగం మౌనం పాటిస్తున్నారా?

కేసీఆర్ మహా తప్పులు ఏవి?

తరువాయి భాగం ….

part 2
డాక్టర్ కేశవులు నేత MD psy Osm చీఫ్ న్యూరో-సైకియాట్రిస్ట్ &  మనో రాజకీయ విశ్లేషకులు & తెలంగాణ మేధావుల సంఘం.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img