శరీరంలో రక్తం గడ్డకట్టడం చాలా ప్రమాదకరం. రక్తం గడ్డకట్టడానికి ప్రమాద కారకాలు ఏమిటి? వాటిని ఎలా నిరోధించాలి? వంటి విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రారంభ దశలో దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే రక్తం గడ్డకట్టి గుండెపోటు, స్ట్రోక్‌లకు దారితీస్తాయి. ఇది ప్రాణాంతకం కావచ్చు. చాలా సందర్భాలలో గుండెపోటు, స్ట్రోక్‌లకు రక్తం గడ్డకట్టడమే ప్రధాన కారణం.
గర్భనిరోధక మాత్రలు వేసుకునే ప్రతి 1 మిలియన్ మహిళల్లో 1200 మందికి రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని, శరీరంలో రక్తం గడ్డకట్టడానికి ఉన్న ప్రధాన కారణాలలో గర్భనిరోధకాలు కూడా ఒక ముఖ్య కారణం.. కరోనా వైరస్ కారణంగా థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ తో థ్రాంబోసిస్ రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది.
అలాగే ప్రతి 1 మిలియన్ ధూమపానం చేసేవారిలో 17,000 మందికి రక్తం గడ్డకట్టే సమస్యలు ఉన్నాయి. అలాగే ఈస్ట్రోజెన్ ఉన్న మందులు తీసుకుంటే రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని .శరీరంలో కొవ్వు పెరగడం, మధుమేహం, కీళ్లనొప్పులు, అధిక బీపీ వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.. రక్తం గడ్డ కట్టితే రక్త ప్రవాహానికి అంతరాయం ఏర్పడి ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే పరిస్థితి సంభవిస్తుంది.
Dr keshavulu MD psy Osm. Chief Neuro-psychiatrist. Dr keshavulu hospitals Nizamabad & Hyderabad