దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిరోజు ఏదో ఘటన జరుగుతూనే ఉంటుంది. అందుకు సంబంధించిన ఘటనలు వైరల్ అవుతూనే ఉంటాయి. ట్రాఫిక్ సమస్యలు, గొడవలు ప్రతినిత్యం చర్చనీయాంశమవుతుంటాయి. ఈ మాటలు నిజమేనని రుజువు చేస్తూ ఓ బస్సు కండక్టర్, కారు డ్రైవర్ మధ్య గొడవ జరిగిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే సంఘటనా స్థలంలో ఉన్న పోలీసు అధికారి ఏం చేశాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. హెల్ప్ లైన్ నంబర్ 100కు డయల్ చేసి పోలీసులకు ఫోన్ చేయాలని ప్రయాణికులు కోరినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
దీనికి సంబంధించిన వీడియోను ఆన్ లైన్ లో షేర్ చేయగా.. నెటిజన్స్ నవ్వించడంతో పాటు కొంత అయోమయానికి గురిచేసింది. మధుబన్ చౌక్ ప్రాంతానికి సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఈ వీడియోను సోషల్ మీడియా ఎక్స్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది. ‘ఢిల్లీలోని మధుబన్ చౌక్ సమీపంలో ట్రాఫిక్ ఇష్యూలో భాగంగా బస్సు డ్రైవర్, కారు డ్రైవర్ మధ్య గొడవ జరిగింది. ఇద్దరు దారుణంగా కొటుకుంటున్నప్పటికీ ప్రయాణికులు నచ్చచెప్పినా వారిద్దరు తగ్గలేదు. అయితే పక్కన ఉన్నే పోలీస్ వారిద్దరిని ఆపే ప్రయత్నం చేయకుండా 100 డయల్ కు ఫోన్ చేయాలని ఉచిత సలహా చెప్పాడు. అయితే అక్కడున్నవారు పోలీసులకు ఫోన్ చేసినా ప్రయోజనం లేకుండాపోయింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఢిల్లీలో ఇలాంటి ఘర్షణలు సర్వసాధారణమని కామెంట్ చేశారు నెటిజన్స్. ఈ వీడియోకు 49కే వ్యూస్ రాగా.. నెటిజన్స్ కూడా కామెంట్లు చేశారు. “భాయ్, అతన్ని ఎలా కొట్టగలడు? అని కొందరు.. ఒక పోలీసు ఏమీ చెయ్యకుండా చూస్తూ నిలబడ్డాడు. ఎందుకు?’ అని మరికొందరు “ఢిల్లీ మెట్రో కంటే ఎక్కువనే అంటూ” ఇంకొందరు నెటిజన్స్ కామెంట్లు చేశారు. అయితే గొడవ సమయంలో పక్కన ఉన్న పోలీస్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రయాణికులకు 100 డయల్ చేయాలని చెప్పడం నెటిజన్స్ ను షాక్ గురిచేసింది.