డా.కేశవులు భాషవత్తినీ. ఎండి, సైకియాట్రీ.
ఒక తెలుగు జాతికి… ఒక తెలంగాణ గడ్డకి అంతర్జాతీయ వేదికపై చిరస్థాయిగా పేరు గెట్చేసిన ఘట్టం ఇది. మిస్ వరల్డ్ 72… ప్రపంచం మొత్తం చూసిన ఓ గొప్ప అద్భుతం. గుండెల్లో గర్వం కలిగించిన సమయం. ఎందుకంటే… ఈ కార్యక్రమాన్ని మామూలుగా కాకుండా — ఎంతో నిండుగా, భావోద్వేగాలతో, తెలంగాణ సంప్రదాయ సుగంధాన్ని అందంగా కలిపి నిర్వహించిన ఘనత ఈ ప్రభుత్వానికి, ఈ నేలకే.
వెనుకటి తెలంగాణ… ఎప్పుడూ వివక్షతో, నిర్లక్ష్యంతో బ్రతికింది. కానీ ఈసారి — ప్రపంచ వేదికపై గట్టిగా చెప్పింది… “మేమూ ఉన్నాం… మేము తెలుగువాళ్లమని!”
హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరిగిన ఈ వేడుకలో — అందమైన లైటింగ్, గీతాల గానాలు, సంప్రదాయ డాన్సులతో పాటు, తెలంగాణ సంస్కృతి సుగంధం అల్లుకున్న తీరు చూస్తే, ప్రపంచం ఫిదా అయ్యింది. పోటీదారులు అంతా చీరలు కట్టుకుని, తాళిబొట్లు ధరించి, బతుకమ్మ పాటలతో అడుగేసిన దృశ్యాలు… చూడగానే కళ్ళలో నీరు తెప్పించాయి.
అందులో ముఖ్యంగా తండాల మెలుకువ, బతుకమ్మ కళ, నాటు వైద్య చింతనలు… ఈ అంతర్జాతీయ వేదికపై ప్రతిధ్వనించాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ — “తెలంగాణ ఓ అభివృద్ధి రాష్ట్రం మాత్రమే కాదు… ఆత్మ గౌరవానికి నిలయమూ… అందమైన సంస్కృతికి ఊపిరి” అన్న తీరు, అక్కడ ఉన్నవాళ్లంతా అభినందించారు. ఈ విజయంతో తెలంగాణ బ్రాండ్ వాల్యూ మాత్రమే కాదు — ప్రతి పల్లెలో, ప్రతి తల్లిదండ్రుల గుండెల్లో — “మన బిడ్డ కూడా ఒక రోజు ఈ వేదికపై ఉండాలి” అన్న ఆశ మళ్లీ నిండిపోయింది.
చివరికి… థాయ్‌లాండ్ ముద్దుగుమ్మ సుచతా చువాంగ్స్రీ విజేతగా నిలవగా… అందరూ మర్చిపోలేనిది — తెలంగాణ పల్లకీ, తెలంగాణ సంప్రదాయం మధ్య ఆమెకు కిరీటం పెట్టిన దృశ్యం. ఇది అంతే… మన తెలంగాణ చరిత్రలో ఒక ఆణిముత్యపు పుట.
ఈ ఈవెంట్ చూపించిన మానవీయత, పర్యాటక పునరుత్థానం, తెలంగాణ కల్చర్‌కు అంతర్జాతీయ గుర్తింపు — ఇవన్నీ కలిపి ఇది ఓ భావోద్వేగ ఘట్టం.