మూడు రాష్ట్రాలకు గానూ కొత్త పీసీసీలను ఖరారు చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పశ్చిమ బెంగాల్ పిసిసి చీఫ్ గా దీపాదాస్ మున్షీ, కేరళ పిసిసి చీఫ్ గా కేసీ వేణుగోపాల్, తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది. కేరళ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాద్, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా ఛత్తీస్ ఘడ్ మాజీ సీఎం భూపేష్ బాగిల్ ను ఖరారు చేసినట్లు ఏఐసిసి ఏఐసీసీ లో ఉన్నత స్థానంలో ఉన్న పెద్దల ద్వారా తెలిసింది. మరి కొన్ని గంటల్లో ఈ జాబితా ను ప్రకటించే అవకాశం ఉంది.