ఈమధ్య దేశవ్యాప్తంగా రాజకీయాలు కంపు కొడుతున్నాయి ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియని అగమ్యగచర పరిస్థితులు కనబడుతున్నాయి, ఉదయం ఒక పార్టీ లో ఉంటే సాయింత్రం ఏ పార్టీ లో అంటున్నారో తెలియడం లేదు, పెద్ద పెల్లి ఎంపీ వెంకటేశ్ నేత.. బీజేపీ వైపు చూస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్ దృష్ట్యా బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టికెట్ ఇస్తే బీజేపీలో చేరతానని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి ప్రతిపాదన పెట్టారని సమాచారం. దీంతో పెద్దపల్లి అభ్యర్థిగా ప్రకటించిన గొమాసే శ్రీనివాస్‌ను మార్చి వెంకటేశ్ నేతకు టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఎంపీ గా బి అర్ ఎస్ నుంచి గెలిచిన వెంకటేష్ నేత మళ్ళీ ఎంపీ టిక్కెట్ వస్తుందనే నమ్మకంతో బి అర్ ఎస్ నుంచి కాంగ్రెసు పార్టీలో చేరారు, కానీ కాంగ్రెస్ నుంచి వెంకటస్వామి మనుమడు వంశీకృష్ణ కు దక్కడం తో సైలెంట్ అయిపోయారు.
బిజేపి ప్రస్తుత అభ్యర్థి గొమాసె శ్రీనివాస్, తన సామాజిక వర్గం నేతకాని కావడంతో బీజేపీ టికెట్ తనకు ఇవ్వాలని వెంకటేశ్ నేత పట్టుపడుతున్నారని తెలుస్తోంది. గొమాసే శ్రీనివాస్ పక్కన పెట్టి వెంకటేశ్ నేతకు టికెట్ ఇస్తే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు గట్టి పోటీనిస్తారా లేదా అని రహస్యంగా సర్వే చేయిస్తున్నట్లుగా తెలుస్తున్నది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రచార సామగ్రిని అన్ని నియోజకవర్గాలకు సరఫరా చేయగా, పెద్దపల్లి నియోజకవర్గానికి సరఫరా చేయలేదని తెలుస్తున్నది. ఒకవేళ బీజేపీ టికెట్ ఇస్తే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని వెంకటేశ్ నేత భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీ అందుకు నిరాకరిస్తే మాత్రం ప్రస్తుతం కొన్ని రోజులు సైలెంట్‌గానే ఉండే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది