విజయవాడలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. కొందరు అగంతకులు ముఖ్యమంత్రి పైకి రాళ్లు విసరడంతో ఆయన ఎడమ కంటి దగ్గర తీవ్ర గాయమైంది. విజయవాడ సింగ్‌నగర్ డాబా కోట్ల సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
విజయవాడలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. కొందరు అగంతకులు ముఖ్యమంత్రి పైకి రాళ్లు విసరడంతో ఆయన ఎడమ కంటి దగ్గర తీవ్ర గాయమైంది. విజయవాడ సింగ్‌నగర్ డాబా కోట్ల సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు నుంచి బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేస్తుండగా ఆగంతకుడు రాయి విసిరాడు. క్యాట్‌బాల్‌లో రాయిపెట్టి విసరడంతో రాయి వేగంగా వచ్చి జగన్ ఎడమ కనుబొమ్మకు తగిలింది. దీంతో కంటి దగ్గర వాపు వచ్చింది. వైద్యులు జగన్ కు ప్రాథమిక చికిత్స అందించారు. చికిత్స తర్వాత యధావిధిగా బస్సు యాత్ర కొనసాగుతోంది. కాగా ఈ ఘటనలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కూడా గాయమైంది