బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. అటు రాజకీయాల్లోనే కాదు ఇటు సోషల్ మీడియాలోనూ యమా యాక్టీవ్‌గా ఉంటారు. అయితే.. నిత్యం ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటే కేటీఆర్.. అప్పుడప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లోనూ మెరుస్తుంటారు. ఈ క్రమంలోనే.. ఇన్‌స్టాలో కేటీఆర్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. కేటీఆర్ పెట్టిన పోస్ట్ వల్ల కాదు.. ఆ పోస్టుకు హీరోయిన్ సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టటం ఇప్పుడు చర్చకు తెరలేచింది. దీంతో.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రాంలో కేటీఆర్ ఒక పోస్ట్ చేశారు. జనాల మధ్య చిరునవ్వుతో ఉన్న తన ఫొటోనూ షేర్ చేసిన కేటీఆర్.. దానికి “జీవితం మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టినా.. వాటిని చిరునవ్వుతో ఎదుర్కోవాలి” అంటూ మోటివేషనల్ క్యాప్షన్ జోడించారు. ఇంతవరకు బాగానే ఉంది. కాగా.. కేటీఆర్ పెట్టిన పోస్టుకు.. హీరోయిన్ సమంత ఫస్ట్ కామెంట్ చేశారు. కేటీఆర్ షేర్ చేసిన ఫోటోను లైక్ చేయడమే కాకుండా.. ఆ ఫోటోకు “నమస్కారం” ఎమోజీని కామెంట్‌గా పెట్టారు సమంత.