తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి కొత్త నాయకున్ని ఎన్నుకుంటామని గతంలోనే కాంగ్రెస్ హై కమాండ్ ప్రకటించిన విషయం తెలిసిందే, జూన్- జూలై లో లోకల్ బాడీ ఎన్నికలు ఉండటంతో ఆ లోగానే కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోతున్నారు. దీంతో ఆశావహులు చాలామంది దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన రేవంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండటంతో ఇతర సామాజిక వర్గాలకు పీసీసీ పదవి దక్కే అవకాశం ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారికి ఇవ్వాలని భావిస్తే మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాగర్ కర్నూల్ లోక్ సభ సీటు ఆశించిన సంపత్ కుమార్ , ఎస్టీ సామాజికవర్గానికి ఇవ్వాలనుకుంటే మంత్రి సీతక్క పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
బీసీ సామాజికవర్గం నుంచి మధుయాష్కీ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ లు పేర్లు వినబడుతున్నప్పటి కి మధు యాష్కీగౌడ్ రాహుల్ గాంధీకి సన్నిహితుడు కావడం ఏ పదవి లేకపోవడం వలన ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. అయితే రేవంత్ ఎవరిపేరు ప్రతిపాదిస్తే వారికే పీసీసీ పీఠం దక్కే అవకాశం. ఎక్కువ కనబడుతుంది.