Thursday, March 13, 2025

పవన్ కల్యాణ్‌తో రేణు దేశాయ్ భేటీ… ఎందుకో తెలుసా?

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ విడాకులు తీసుకుని చాలాకాలం అయినప్పటికి తెలుగు ఇండస్ట్రీలో ఆమెకంటూ ప్రత్యక స్థానం ఉంది. ఇండస్ట్రీ కి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంది.

రవితేజ హీరోగా తాజాగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్‌ ఓ ముఖ్య పాత్రలో నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొల్తా కొట్టింది. ఆ మధ్య రెండో పెళ్లి చేసుకోవాలని ప్రకటించినప్పటికి, పవన్ అభిమానుల విమర్శలకు ఆ నిర్ణయం వెనక్కి తీసుకుంది. ఈ సమయంలో ఆమె పవన్ కల్యాణ్ నుంచి తీవ్ర ట్రోలింగ్‌కు కూడా ఎదురైంది. పవన్ అభిమానులకు ఆమె అదే రీతిలో కౌంటరిచ్చేవారు. ఇదిలా ఉంటే రేణు దేశాయ్ తన మాజీ భర్త పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నారని తెలిసింది.

భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్‌కు చీఫ్ అడ్వైజర్‌గా రేణు దేశాయ్ కొనసాగుతున్నారు ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌‌లో పిల్లలకు ఆధ్యాత్మికత చాలా అవసరమని, దీని గురించి వివరించి యూనివర్సిటీ ఏర్పాటుకు మంత్రులతో రేణు దేశాయ్ చర్చించనున్నారు. విడాకులు తర్వాత తొలిసారి ఇలా అఫీషియల్‌గా పవన్‌ను రేణుదేశాయ్ కలుస్తున్నారని తెలుసుకున్న ఫ్యాన్స్‌ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img