Friday, March 14, 2025

సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయండి ! సీఎం రేవంత్ రెడ్డికి మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్. బి . కేశవులు డిమాండ్..

రాష్ట్రంలో సర్వ శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ)లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నపది విభాగాలకు చెందిన ఉద్యోగులు న్యాయంగా వారికి రావాల్సిన సౌకర్యాల కోసం అనేకేండ్లుగా ఉద్యమాలు చేస్తూ నేడు సమ్మెలో ఉన్నారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం స్పందించకుండా కాలయాపన చేస్తోందని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగుల ధర్నా టెంట్లకు వద్దకు వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 100రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆనాటి పీసీసీ అధ్యక్షుడు హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి హామీ యిచ్చి పట్టించుకోవడంలేదని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ బి కేశవులు ఆరోపించారు.

సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న ఉద్యోగులు చేస్తున్న ధర్నాకు ముఖ్యఅతిథిగా హాజరై డాక్టర్ కేశవులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సంవత్సరం దాటినా ఉద్యోగుల సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వ కార్య చరణ లేదు. వివిధ సంఘాల కింద ఉన్న ఉద్యోగులందరూ జేఏసీగా ఏర్పడి సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలోకి వెళ్లినా కూడా ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించడం లేదు. ఉద్యోగులకు భరోసా కల్పించే చర్యలు తీసుకోవడం లేదని డాక్టర్ కేశవులు ఆవేదన వ్యక్తం చేశారు.

కనీస వేతనం, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్ …

సర్వ శిక్ష ఉద్యోగులు. కోరుతున్న న్యాయ, ధర్మబద్ధమైన డిమాండ్స్ కోసం సమ్మె చేసే పరిస్థితి ఏర్పడటం బాధాకర మని, కనీస వేతనం, ఉద్యోగ భద్రత, మహిళా ఉద్యోగులకు సాధారణంగా ఉన్న సేవలను వీరు ఉపయోగించుకునే పరిస్థితి లేదు. సాధారణ సెలవులు, ప్రసూతి సెలవులు కూడా పూర్తిస్థాయిలో అమలుకావడం లేదు. ఇక పీఎఫ్, ఈఎస్ఐ లాంటివి లేనే లేవు. హెల్త్ కార్డులు, ప్రమాద బీమా, న్యాయబద్ధంగా రావాల్సిన రక్షణ పథకాలు కూడా రావటం లేదు. పదేండ్లుగా ఈ సంస్థల అభివృద్ధి కోసం, పేద పిల్లల అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఉద్యోగులు, వర్కర్స్ రెగ్యులరైజ్ చేసే ఉద్దేశమే ప్రభుత్వాలకి లేదు అనిపిస్తుంది. మణిపూర్, పంజాబ్, త్రిపుర, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ బేసిక్ పే చెల్లిస్తున్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతనం కూడా దక్కటం లేదు. వీరి సమస్యలు పరిష్కారం కావాలంటే ఎస్ ఎస్ సి (సర్వ శిక్ష అభియాన్)ను విద్యాశాఖలో విలీనంచేయాలని, అందరినీ రెగ్యులరైజ్ చేయాలని సమాన పనికి సమాన వేతనం, బేసిక్ పేని నిర్ణయించాలని, ఈ ఎస్ఐ, పీఎఫ్ వైద్య తదితర సౌకర్యాలను కల్పించాలని డాక్టర్ బి కేశవులు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img