టీ టైమ్స్ ముఖ్య ప్రతినిధి : ఎవరు కూడా ఊహించని విధంగా…… సాక్షాత్తు ఆ పార్టీలు కూడ కలలో సైతం ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నారు. అదే ఏపీ లో టిడిపి, జనసేనా బిజేపి కూటమి యొక్క ఘన విజయం గురించీ……ప్రస్తుతం దేశ మొత్తం చూపు చంద్రబాబు నాయుడు పై ఉందనటంలో సందేహమే లేదు, గతంలో దేశ రాజకీయాలను శాచించిన చంద్రబాబు నాయుడుకి మళ్ళీ అవకాశము రావడం ఏపీ కి శుభ సూచకమే. అయితే ఇంతటి ఘన విజయానికి మూల స్తంభమైన పవన్ కళ్యాణ్ గురించే ఆంధ్ర ప్రదేశ్ లో భారీ చర్చ జరుగుతుంది. రెండుసార్లు ఓటమి పొందినప్పటికీ, వెను తిరుగకుండ ఆ పార్టీ నిలపెట్టిన ఇరవై ఒక్క స్థానాలలో 21 స్థానాలు సొంతం చేసుకోవడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి,
అసలు కూటమికి కారణమైన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏ పాత్ర పోషించబోతున్నారు ? ప్రతిపక్ష నేతగా ? మరేమిటో అర్థం కాక జన సైనికులు అభిమానులు పరేషాన్ అవుతున్నారు. అయితే…మొన్న విలేకరుల సమావేశంలో లోకేష్ ను ఒక విలేకరి పవన్ కళ్యాణ్ కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నారా ? అని అడగగా చంద్రబాబు నాయుడు గారు అంతకంటే గొప్ప పదవే ఇవ్వబోతున్నరని చెప్పడం మనందరికీ తెలిసిందే ?
ఆ గొప్ప పదవీ ఏమిటో తెలుసా ? కేంద్ర మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ క్యాబినెట్ మంత్రి కావడమే ! అదే విషయమై చంద్రబాబు మోడీతో కూడా మాట్లాడినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రాజ్య సభ కు పంపడం ద్వారా యువజన టూరిజం శాఖ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, జనసేన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి కేంద్రంలో పవన్ కళ్యాణ్ కు ఉన్నత స్థానాన్ని ఇచ్చినట్లయితే భవిష్యత్తులో కూడా ఏ రకమైన ఇబ్బందులు రావని అందుకనే ఈ నిర్ణయం బాబు తీసుకున్నారని, ఇది నిజం కాబోతుందని ఢిల్లీ రాజకీయ సర్కిల్లో హాట్ టాపిక్ అయింది..ఇది నిజమో కాదో వచ్చే 24 గంటల్లో తెలియబోతుంది..1