నేటి సమాజంలో పిల్లల పెంపకము ప్రతి తల్లిదండ్రులకు పెద్ద చాలెంజ్. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటారు, పిల్లలకు ఏది మంచో, ఏది చెడో , ఏమి చేయాలో, చేయకూడదో తల్లి దండ్రులే చెపుతుంటారు,, అయితే తల్లిదండ్రుల ప్రవర్తన, వారి అలవాట్లు కూడ పిల్లల సక్సెస్ కావడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పిల్లలు సక్సెస్ కావడానికి దోహదపడే కొన్ని అలవాట్లు ప్రవర్తనలు గురించి ప్రఖ్యాత మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బీవీ కేశవులు ఎండి వివరిస్తున్నారు-, అవేంటో తెలుసుకోండి..
IQ తో పాటు EQ ముఖ్యమే…
చాలామంది ఇంటిలిజెన్స్ IQ ఎక్కువగా ఉంటే చాలు సరిపోతుందని భావిస్తారు, కానీ ఎంత IQ ఉన్నప్పటికీ మానసిక భావోద్వేగాల EQ ను నియత్రించుకునే శక్తి లేకపోతే జీవితం లో విజయం సాధించడము కష్టం,భావోద్వేగాలను నియంత్రించుకునే వ్యక్తులు విజయంతో పాటూ… సంతోషంగా కూడా ఉంటారు. ఎక్కడ ఆగకుండా ముందుకు సాగుతారు.ఐక్ ఉండి EQ లేకపోతె ముందుకెళ్లి సక్సెస్ కావడం చాలా కష్టం.
ఇతరులతో పోలికలు..
నేటి తల్లిదండ్రులు చేస్తున్న అతి పెద్ద తప్పు… తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చడమే…తల్లిదండ్రులు తమ బిడ్డనుఎట్టి పరిస్థితుల్లోను ఎవరితోనూ పోల్చవద్దు , అలాగే తనను తాను ఎవరితోనూ పోల్చుకోవద్దని పిల్లలకు నేర్పించాలి. పోలికలతో పిల్లలలో ఆత్మనూన్యత భావన పెరిగిపోయే అవకాశం హే.. కావున జీవితంలో తనకు తానుగా స్వంతంగా ముందుకు వెళ్లడమే ముఖ్యమని పిల్లలకు ప్రోత్సహించాలి.
ఆత్మ విశ్వాసం…
తల్లిదండ్రులు తమ బిడ్డ ఉన్నత స్థానాలలో ఉండాలనే కోరుకుంటారు, అందుకు ఆత్మవిశ్వాసం అత్యంత ముఖ్యమైనది, చాలామంది అత్మ విశ్వాసం కోల్పోవడం లేదా లేకపోవడం వల్ల తమను తాము తక్కువగా అంచనా వేసుకోవడం వల్ల జీవితంలో ముందుకు వెళ్లలేకపోతున్నారు, పిల్లల ఆత్మ విశ్వాసం పెరిగే విధంగా తల్లిదండ్రులు నడవాలి , అంతేకాని నీ నుంచీ ఇదికాదు, వేస్టే ఫెల్లో అంటూ తగ్గించే విధంగా ప్రవర్తిస్తుంటారు ఇది చాలా ప్రమాదకరం,
తోడూ నీడగా….
తినలేదు అనుభవం లేకపోవడం వల్ల చాలా తప్పులు చేస్తుంటారు ఇటువంటి పరిస్థితులలో ఏది మంచో ఏది చెడో చెప్పుకుంటూ సొంత నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రోత్సహిస్తూ పిల్లలు స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం, నేర్చుకునే సందర్భాల్లో తల్లి దండ్రులు తోడుగా నీడగా ఉంటే, మీరు ఉన్నారనే ధైర్యంతో పాజిటివ్ తో ఉంటారు.., భవిష్యత్తులో వారు సరియైన మార్గంలో వెళ్లడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అందుకు తల్లిదండ్రులు సదా తమ పిల్లలను ప్రోత్సహిస్తూ ఉండాలి.
టైమ్ & టార్గెట్ రెండూ…
ముందుగా భవిష్యత్తులో పిల్లలు ఏం చేయాలను కుంటున్నారో , ఏం కావాలనుకుంటున్నారో పిల్లలకు అవగాహన వచ్చిన తర్వాతనే పిల్లల తో కలసి కూర్చోని నిర్ణయించండి.ముందుగా ఏ పని.. తర్వాత ఏ పని చేయాలి – చేయకూడదు, ఏ పనికి ఎంత సమయం ఇవ్వాలనే నిర్ణయాలు నేర్పడం ద్వారానే అలవడుతుంది. అందుకే పిల్లలకు టైం మేనేజ్‌మెంట్ తో పాటు టార్గెట్ రీచ్ కావడానికి ఎలా కష్ట పడాలో చిన్నతనం నుంచే నేర్పించడం చాలా అవసరం.