అఖిల భారతీయ పద్మశాలి సంఘం సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ శ్రీ దాసరి నర్సింహులు బలపరిచిన జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం నాడు ఖలీల్ వాడిలోని జిల్లా సంఘం భవనంలో ప్రకటించారు. గతంలో అధ్యక్ష పదవికి బల్పరిచిన శ్రీ మైసల నారాయణతో పాటు కింది కార్యవర్గాన్ని నేడు ప్రకటించారు.
నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘ ప్రధాన కార్యదర్శిగా శ్రీ బొడ్డు గంగ ప్రసాద్, ఉపాధ్యక్షులుగా శ్రీ గాలిపల్లి నారాయణ, పాము రమేష్, అంకం జగదీష్, గంగుల దత్తాద్రి, ఆరుట్ల రాజేంద్రప్రసాద్ లు.సహాయ కార్యదర్శులుగా శ్రీ దేవల్ బజరంగ్, పద్మ సుభాష్, సాంబారు తిరుపతి (నందిపేట). ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రీ ఉప్పరపల్లి నాగరాజు, ప్రచార కార్యదర్శిగా శ్రీ కూరపాటి వెంకట్, కోశాధికారిగా శ్రీ దిండిగళ్ళ శంకర్ గార్లు నియమించబడ్డారు. సలహాదారులుగా డాక్టర్ ఎం శ్రీహరి, డాక్టర్ సుభాష్, డాక్టర్ కేశవులు, శ్రీ పెంటా దత్తాత్రి, కన్నా శ్రీనివాస్, ఉప్పరపల్లి శ్రీనివాస్ లు, కార్యవర్గ సభ్యులుగా గర్దాస్ శంకరు, ఆడెపు రాజన్న, విఠం వెంకటరమణ, జట్ల బాలరాజు, గండి గణేషు, షేర్ పల్లి బాబురావు లు నియమించబడ్డారు.
