దేశంలో కుల గణనపై మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి.
గత సంవత్సరం ఫిబ్రవరి 2024 లో 59 శాతం మంది మద్దతు పలకగా,అదే సంవత్సరం ఆగస్టులో 74 శాతం మంది, ఇక ఫిబ్రవరి 2025 లో 69 శాతం మంది మద్దతు పలికారు.
క్యాస్ట్ సెన్సెస్ వద్దనే వారు గత 2024 ఫిబ్రవరి లో 22 శాతం మంది వ్యతిరేకించగా, అదే సంవత్సరం ఆగస్టు 2024 లో 24 శాతం మంది, ఫిబ్రవరి 20 25 లో 26% మంది వ్యతిరేకించారు.

- ఉత్తర భారతదేశంలో స్పందన
బీహార్ కులగణన విడుదల తర్వాత మతాధారిత రాజకీయం నుంచి సామాజిక న్యాయం వైపు దృష్టి మళ్లింది.ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో బహుజన సంఘాలు కుల గణనను స్వాగతించాయి. మధ్యతరగతి ప్రజల్లో కానీ, కొందరు బ్రాహ్మణ, రాజపుత్ వర్గాల్లో మాత్రం దీని పట్ల అసహనం కనిపిస్తోంది.
- దక్షిణ భారతదేశంలో స్పందన
తమిళనాడు, కర్ణాటకలో దళిత, ఓబీసీ సంఘాలు దీన్ని బలంగా మద్దతు ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే మిశ్రమ స్పందన. బీసీ సంఘాల నుంచి గణనకు మద్దతు ఉంది కానీ, కొన్ని కాపు, రెడ్డి, కమాండ్ల వర్గాల్లో పాక్షిక అపోహలు కూడా ఉన్నాయి.
- నగర vs గ్రామీణ అభిప్రాయం
గ్రామీణ ప్రజలలో కుల గణన సామాజిక సమానత్వానికి ఉపయోగపడుతుందన్న విశ్వాసం ఉంది.
నగర ప్రజల్లో – ముఖ్యంగా విద్యావంతులలో – ఇది రాజకీయం కోసమే వాడుతున్న టూల్ అని అభిప్రాయం.
- యువతలో స్పందన
యువతలో ఈ విషయంలో స్పష్టమైన చీలిక ఉంది. మౌలిక వనరుల కేటాయింపు కోసం కుల గణన అవసరం అని కొందరు భావిస్తుండగా, “ఇక దేశం కులరహితంగా అభివృద్ధి చెందాలనే” వాదనను మరికొందరు మద్దతు ఇస్తున్నారు.
- సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్
“కుల గణన – న్యాయం కోసం!”, “India Wants Caste Census” వంటి హ్యాష్‌ట్యాగులు ట్రెండ్ అవుతున్నాయి. అదే సమయంలో #StopCastePolitics వంటి క్యాంపెయిన్‌లూ కనిపిస్తున్నాయి.
- రాజకీయాల్లో ప్రభావం
కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రధాన ఎజెండాగా మార్చగా, బీజేపీ మొదట వ్యతిరేకంగా స్పందించినా, ఇప్పుడు దానిపై బహుళ అర్థాల వ్యాఖ్యలు చేస్తోంది. ప్రాంతీయ పార్టీలు – RJD, SP, DMK – దీన్ని సమాజ పరిరక్షణ చర్యగా చూస్తున్నాయి.