Saturday, March 15, 2025

నో బీపీ. నో కొలెస్ట్రాల్, నో షుగర్ మరీ హార్ట్ ఎటాక్ ఎలా వస్తోంది, నిర్లక్ష్యం చేస్తే చాలా డేంజర్ !

నో కొలెస్ట్రాల్, నో బీపీ. నో షుగర్, ఉభకాయం లేదు, తినేదీ ఆరోగ్యకరమైన ఆహారం. క్రమం తప్పకుండా వ్యాయామమూ చూడటానికి ఆరోగ్యంగా కనిపిస్తుంటారు. అయినా ఉన్నట్టుండి గుండెపోటు వచ్చి క్షణాల్లో చని పొతున్నారు. గుండెపోటులో ఇదొక విభిన్న మైన రకం. దానినే స్పాంటేనియస్ కరోనరీ ఆర్టరీ డిసెక్షన్ (ఎస్సీఏడీ) అంటారు. యాభై ఏళ్లలోపు చిన్నవయసులో మహిళల్లో ఎక్కువగా వస్తోంది. సకాలంలో స్పందించి చికిత్స చేయకపోతే ప్రాణాలకు ప్రమాదం వాటిల్లొచ్చనీ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపికృష్ణ ఎండీ డీఎం . హైటేక్ సిటీ, యశోదా హాస్పిటల్. హైదరాబాద్ చెపుతున్నారు

రక్తనాళాల పూడికలు కాదు…

సాధారణంగా రక్తనాళాల్లో పూడికల వల్ల గుండెపోటు వస్తుంటుంది. కానీ ఎస్సీఏడీ తీరే వేరు. ఇందులో రక్తనాళాల మధ్య పొర చీలుతుంది, దానితో రక్తం గూడు కట్టి, రక్తం నాళం గోడ పొరలు విడిపోతుంటాయి. ఫలితంగా రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడి గుండెపోటు వస్తోంది. చాలామంది లో ముట్లు ఆగిపోయే వయసులో 44 – 53 ఏళ్ల మధ్యలో వస్తోంది. ఇంకా విచిత్రంగా ఇటీవల కాన్పు అయినవారిలోనూ 15 నుంచి 43 శాతం మంది దీని బారినపడుతుండటం గమనార్హం. ఎస్సీఏడీకి హార్మోన్లు, ఇవి అనుసంధాన కణజాలాల మీద చూపే ప్రభావం కారణం కావొచ్చని భావిస్తున్నారు. అప్పటికే ఎస్ఆర్స్- డ్యాన్లోస్ సిండ్రోమ్ వంటి అనుసంధాన కణజాల సమస్యలు ఉండటం లేదా రక్తనాళ గోడల్లో కణాలు అసాధారణంగా వృద్ధి చెందటం వంటివీ దీనికి దారితీయొచ్చనీ డాక్టర్ గోపికృష్ణ తెలుపుతున్నారు.

ఎమోషన్స్ ప్రమాదమే….


అంతే కాకుండా మానసికంగా తీవ్ర భావోద్వేగాలకు లోనవటం, శారీరకంగా ఒత్తిడికి గురికావటమూ ఎస్సీఏడీకి దోహదం చేయొచ్చనీ డాక్టర్ . గోపికృష్ణ అంటున్నారు , దీని బారినపడుతున్నవారిలో సుమారు 50% మంది తీవ్ర భావోద్వేగానికి గురవటం.. 20 నుంచి 30 శాతం మంది కఠినమైన వ్యాయామం చేసినవారు ఉంటుండటం కనిపిస్తోంది. అడ్రినలిన్ హార్మోన్ వంటి ఒత్తిడి కారకాలు సింపథెటిక్ నాడీ వ్యవస్థ, రక్తపోటు, గుండె వేగాన్ని చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అప్పటికే రక్తనాళం బలహీనంగా, తేలికగా చీలటానికి అనువుగా ఉన్నప్పుడు ఎస్ సీఏడీ తలెత్తే అవకాశముంటుంది. కావున బహు జాగ్రత్త అవసరం సుమా!

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img