వర్షాకాలం రాగానే సీజనల్ వ్యాధులు చుట్టుముడతాయి. వాతావరణ మార్పులు, నీరు, ఆహారం కలుషితమవడం కారణంగా అనేక వ్యాధులు సంక్రమిస్తాయి. ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్ లు శరీరంలోకి చేరి అనారోగ్యానికి గురిచేస్తాయి. ఇక దోమల కారణంగా డెంగ్యూ, కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులు కూడా వర్షాకాలంలో చాలా ఈజీ వ్యాపిస్తాయి.ఈ వ్యాధులు చాలవన్నట్లు ఇప్పుడు కొత్త వ్యాధి తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ లో వేగంగా వ్యాపిస్తోంది.
నోరో వైరస్ లక్షణాలు :
- తరచూ వాంతులు కావడం
- డిహైడ్రేషన్ (నోరు తడారిపోవడం, ఎక్కువగా దాహం కావడం, యూరిన్ సరిగ్గా రాకపోవడం లేదా యూరిన్ రంగుమారడం)
- విపరీతమైన కడుపునొప్పి
- విపరీతమైన చలిజ్వరం
- ఒళ్లునొప్పులు
- విపరీతమైన తలనొప్పి ..
వైరస్ వ్యాప్తికి కారణాలు :
కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల నోరో వైరస్ బారిన పడుతున్నారు. కలుషిత వాతావరణం కూడా ఈ వైరస్ వ్యాప్తికి కారణమవుతోంది. ఇది అంటువ్యాధి… కాబట్టి ఒకరినుండి ఒకరికి వేగంగా వ్యాపిస్తుంది. వైరస్ సోకినవారితో సన్నిహితంగా వుండేవారు సులభంగా ఈ వైరస్ బారిన పడతారు. ఈ వైరస్ సోకిన వ్యక్తికి 48 గంటల్లోనే వ్యాధి లక్షణాలు బయటపడతాయి. కాబట్టి లక్షణాలు బయటపడిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచిది. లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. సమయానికి వైద్యం అందితే రెండుమూడు రోజుల్లోనే ఆరోగ్యం కుదుటపడుతుంది.
జాగ్రత్తలు :
నోరో వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తోంది… కాబట్టి హైదరాబాద్ ప్రజలు జాగ్రత్తగా వుండటం చాలా అవసరం. ఇది అంటువ్యాధి కాబట్టి స్కూళ్లు, ఆఫీసుల, జనాలు ఎక్కువగా వుండే ప్రాంతాల ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో జాగ్రత్తగా వుండాలి. ముఖ్యంగా స్కూళ్లలో చిన్నారులను భౌతికదూరం పాటించేలా చూడాలి.
Dr keshavulu MD psy
0sm.