Friday, March 14, 2025

కండోమ్‌లను ఎక్కువగా వాడుతున్నది ముస్లిం లే.. అసదుద్దీన్ హాట్ కామెంట్స్…

Telangana Times Desk: దేశ వ్యాప్తంగా ముస్లిం జనాభా పెరుగుదలపై వస్తున్న రాజకీయ విమర్శలకు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ హాట్ కామెంట్స్ చేసారు, కాంగ్రెస్ గెలిస్తే.. ఎక్కువమంది పిల్లలు ఉన్న వారికి, చొరబాటుదారులకు సంపదను పంపిణీ చేస్తారంటూ బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ అసదుద్దీన్ ….ప్రస్తుత కాలంలో జనాభా నియంత్రణకు ఎక్కువగా కండోమ్‌లు వాడుతున్నది ముస్లింలు మాత్రమేనని, ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఈ విషయం చెప్పడానికి తనకు సిగ్గు అనిపించడం లేదన్నారు.

“ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటారన్న భయాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు? ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ముస్లింలలో జనాభా పెరుగుదల, సంతానోత్పత్తి తగ్గింది. ముస్లింలు మెజారిటీ కమ్యూనిటీ అవుతారని హిందువులలో భయాన్ని కలిగిస్తున్నారు.. ఎంతకాలం ముస్లింల గురించి చెప్పి భయాన్ని సృష్టిస్తారు? మా మతం వేరు కావచ్చు.. కానీ మేము ఈ దేశానికి చెందినవాళ్ళమే కదా అంటూ భావోద్వేగంతో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img