ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయి జైలులో ఉన్న MLC కవిత అప్రూవర్ గా మారాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాను ఎటువంటి తప్పు చేయలేదని, అప్రూవర్ గా మారే ప్రసక్తే లేదని కవిత గతంలోనే తేల్చి చెప్పిన ప్పటికీ.అకస్మాత్తుగా ఎలా ఎలా నిర్ణయం తీసుకుంటుంది, అప్రూవర్ గా మారనున్నారా? భవిష్యత్తును దృష్టిలో ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదే కేసులో అరెస్ట్ అయిన సిసోడియా సంవత్సరం నుంచి జైలులోనే ఉన్నారు. తన భార్య క్యాన్సర్ పేషెంట్ అని విన్నవించినప్పటికీ బెయిల్ నిరాకరణకు గురైంది. అయితే అదే కేసు లో అనారోగ్యంతో శరత్చం ద్రారెడ్డికి మాత్రం వెంటనే బెయిల్ మంజూరవడం విశేషం. ఈ కేసులో అప్రూవర్లుగా మారినవారంతా బెయిల్ పై బయటకు వచ్చారు,
ఈ నేపథ్యంలోనే కవిత కూడా తాను అప్రూవర్ గా మారేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని తన న్యాయవాదులకు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. మనీ లాండరింగ్ కేసుల్లో అంత సులువుగా బెయిల్ రాదు. అప్రూవర్లుగా మారినవారందరికీ ఈ కేసులో బెయిల్ లభించింది. దీంతో అప్రూవర్ గా మారితేనే బయటకు రావడానికి వీలుపడుతుందని అర్థం కావడంతో కవిత ఈ నిర్ణయం తీసుకొన వచ్చు ననే మాటలు వినపడుతున్నాయి.