టీ టైమ్స్ ప్రత్యేక ప్రతినిధి. నిజామాబాద్ :
దాసరి నర్సింలు ఆధ్వర్యంలో 07.07.2025 రోజున అఖిలభారత పద్మశాలి సంఘం అనుబంధ సంస్థ అయినటువంటి నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘ సమావేశం నిర్వహించడం జరిగినది. ఇట్టి జిల్లా సమావేశంలో నూతన అధ్యక్షునిగా మైసల నారాయణ గారికి ఏకగ్రీవంగా తీర్మానం చేసి నియమించడం జరిగినది. ఇందులో పాల్గొన్నవారు. నిజామాబాద్ పద్మశాలి హాస్టల్ అధ్యక్షులు రచ్చ మురళి గారు, పాము రమేష్, గాలి పల్లి నారాయణ, దిండి గళ్ళ శంకర్, భీమర్తి రవి, కోడూరు స్వామి, ఆడెపు రాజన్న, బొట్టు వెంకటేష్, సిరిగాదె మనోహర్, సురుకుట్ల భాస్కర్, బొడ్డు గంగా ప్రసాద్, సామల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
