టీ. టైమ్స్ ముఖ్య ప్రతినిధి; తెలంగాణ కాంగ్రెస్ లో యుద్ధం తలపించే రీతిలో పీసీసీ పోస్టు కొరకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.. ఢిల్లీ లోని ఏఐసీసీ ఆఫీస్ చుట్టూ ఆశావహుల సందడి ఎక్కువగా ఉంది. జూలై 7 తో రేవంత్ రెడ్డి టర్మ్ పూర్తి కావడంతో కేంద్ర అగ్రనాయకత్వం సీరియస్ గా చర్చిస్తుంది. అయితే ఎవరైనా కూడ కేవలం రేవంత్ రెడ్డి సమ్మతిచ్చిన వారికె పిసిసి అధ్యక్ష పదవి వరించనుందని డిల్లీ వర్గాల కథనం.
ముఖ్యమంత్రి ఉన్నత వర్గాలకు చెందిన వాడు కావడంతో పీసీసీ పదవిని కచ్చితంగా బీసీ వర్గానికి ఇవ్వాలని ఏఐసిసి అగ్రనాయకత్వం నిర్ణయించినట్టు తెలిసింది ఇప్పుడున్న పరిస్థితులలో ఆది నుంచి పార్టీలోనే ఉండి విశ్వాసపాత్రుడుగా ఉన్న వాళ్లకే ఇవ్వాలని పార్టీ పెద్దలు, కార్యకర్తలు కూడ ఒకే అభిప్రాయంతో ఉండటంతో పార్టీని నమ్ముకున్న వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ మరియు బలరాం నాయక్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్నట్లు తెలుస్తుంది.
అయితే రేవంత్ బలరాం నాయకకు మాత్రమే ఓకే చెప్పినట్టు తెలిసింది, మహేష్ కుమార్ గౌడ్కు ఇప్పటికే ఎమ్మెల్సీ ఉండటం వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేయడంతో రెండు పదవులు ఉండటం వలన మూడోపది అవసరం లేదని కేంద్ర నాయకత్వం చెప్పినట్టు తెలుస్తుంది..