ఐపీఎల్ 2024లో కేకేఆర్ మళ్లీ విజయాల బాట పట్టింది. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలై.. ఈ సీజన్‌లో తొలి ఓటమి నమోదు చేసింది కోల్‌కతా. కానీ ఆదివారం సొంత గడ్డపై లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. తొలుత లక్నోను 161 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సీజన్‌లో నాలుగో విజయాన్ని నమోదు చేసింది. కాగా ఐపీఎల్‌లో కేకేఆర్ జట్టు.. లక్నోను ఓడించడం ఇదే తొలిసారి.