Saturday, March 15, 2025

శిక్షణ పూర్తి చేసుకొని జిల్లా చేరుకున్న “కాకర్‌ స్పానియల్” జాతికి చెందిన పోలీస్ జాగిలం

స్టేట్ న్యూస్ తెలుగు,05 మార్చి (ఖమ్మం)

నేర దర్యాప్తు సమయంలో పోలీసు జాగిలాల సేవలు ఎంతో కీలకమని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పేర్కొన్నారు. మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో (Explosive) పేలుడు పదార్థాలను కనుగొనడంలో హాండ్లర్ కానిస్టేబుల్ Sk.పాషా ప్రత్యేక శిక్షణలో 8 నెలల పాటు కఠోర శిక్షణ..పూర్తి చేసుకొని జిల్లాకు చేరుకున్న “కొకర్‌ స్పానియల్” జాతికి చెందిన 10 నెలల పూనమ్ అనే జాగిలాన్ని పోలీస్ కమిషనర్ అభినందించారు. ప్రత్యేక శిక్షణ పొందిన పోలీసు జాగిలాలు సంక్లిష్టమైన కేసుల పరిశోధన, ఛేదనలో అత్యంత కీలక పాత్ర వహించేలా విధుల్లో మరింత ప్రతిభ కనబరుస్తాయని తెలిపారు.

మొయినాబాద్‌ శిక్షణ కేంద్రంలో 21 జాగిలాలకు 8 నెలల పాటు 28 మంది హాండ్లర్స్‌ (శిక్షకులు) ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.21 జాగిలాలలో ప్రధానంగా లాబ్రడార్, జర్మన్‌ షెపర్డ్, బెల్జియం మాలినాయిస్, కాకర్‌ స్పానియల్, గోల్డెన్‌ రిట్రీవర్‌ జాతులకు చెందినవి ఉన్నాయని హాండ్లర్స్‌ వివరించారు.

కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీ నర్సయ్య, ఆర్ ఐ కామరాజు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img