ప్రత్యేక తెలంగాణ కొరకు తన జీవితాన్ని పూర్తిగా త్యాగం చేసిన అత్యంత నిజాయితీపరుడు తెలంగాణ జాతిపిత శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతిని అధికారికంగా నిర్వహించకపోవడం, అధికార పార్టీ, ప్రతిపక్ష నేతలు సైతం మర్చిపోవడం అత్యంత బాధాకరమని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్. బి. వి కేశవులు అన్నారు.
శుక్రవారం ప్రో జయ శంకర్ వర్థంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ చౌరస్తాలో గల జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల అర్పించిన అనంతరం డాక్టరు కేశవులు మాట్లాడుతూ నిజాం కాలంలో జయశంకర్ సారు ఆరో తరగతిలో ఉన్నప్పుడే నిజాం ను కీర్తించుమని స్కూల్లో టీచర్లు చెప్పినప్పుడు వాటిని వ్యతిరేకించి వందేమాతరం తప్ప, ఎలాంటి కీర్తనలు తాను కీర్తించలేనని ఎదిరించిన మహా పురుషుడు జయశంకర్ సార్ మాత్రమేనని కొనియాడారు.
చిన్నప్పటి నుంచి తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా పోరాడిన జయశంకర్ సార్ చరిత్రను పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశంగా చేర్చాలని కూడ డాక్టర్ కేశవులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రామిక శక్తి ఎడిటర్ రేపల్లి శ్రీనివాస్, అడ్వకేట్ సుదర్శన్ రావు, నిజామాబాద్ అభివృద్ధి వేదిక సెక్రటరీ నరసయ్య, డీఎల్ న్ చారి తదితరులు ఎత్తున పాల్గొన్నారు.