Saturday, March 8, 2025

జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గా ఆర్ కృష్ణయ్య ?

టీ టైమ్స్ ప్రత్యేక ప్రతినిధి – వైకాపా రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘాల నేత ఆర్‌.కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆర్‌.కృష్ణయ్య రాజీనామాని ఆమోదించిన రాజ్యసభ ఛైర్మన్‌.. ఆ స్థానం ఏపీ నుంచి ఒక సీటు ఖాళీ అయినట్టు బులెటిన్‌ విడుదల చేశారు. దశాబ్దాలుగా బీసీలకు పెద్దదిక్కుగా, తెలుగు రాష్ట్రాల్లో ఆ సామాజికవర్గానికి కృష్ణయ్య నాయకత్వం వహిస్తున్నారు. గతంలో ఎల్బీనగర్‌ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్‌.కృష్ణయ్య తర్వాత బీఆర్‌ఎస్‌కి మద్దతిచ్చారు.2022లో వైసీపీ కృష్ణయ్యను అనూహ్యంగా రాజ్యసభకు పంపింది.

ఆర్‌.కృష్ణయ్య కొత్త పార్టీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారన్న చర్చ కూడా నడుస్తోంది. ప్రచారాలకు బలం చేకూర్చేలా నాలుగేళ్ల పదవీకాలం మిగిలి ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు ఒక ప్రైవేట్ టీవీ చానల్ ద్వారా ప్రకటించారు.తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంచుతామన్నారు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుందని, కానీ లాభం లేదని అందుకే బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకే 100 బీసీ కుల సంఘాలతో చర్చించి రాజీనామా చేసినట్లు, బీసీ రిజర్వేషన్లకు మద్దతిచ్చే పార్టీతో కలుస్తామంటూ ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు.

అయితే ఇలా ఉండగా మంద కృష్ణమాదిగ చొరవతోనే బీజేపీ కి దగ్గర అయినట్లు తెలుస్తోంది, బర్త్ డే రోజున పీఎం మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలపడం తెలిసిందే, ఆ తర్వాత బిజెపి అధిష్టానంతో అత్యంత సన్నిహితుల ద్వారా చర్చలు జరిగినట్లు, ఆ చర్చలలో వైకాపా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం పైన నిర్ణయం జరిగినట్టు తెలుస్తుంది, ఆ తర్వాత కేంద్ర క్యాబినెట్ ర్యాంక్ గల జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ పదవి హామీ ఇచ్చారని కేంద్ర బిజెపి ఆఫీసు నుంచి అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img