మాజీ పిసిసి అధ్యక్షుడు రాజకీయ కురువృద్ధుడు ధర్మపురి శ్రీనివాస్ గారి చిన్న కొడుకు ధర్మపురి అరవింద్ గత లోక్ సభ ఎన్నికల్లో ఆశ్చర్యంగా బిజెపి పార్టీలో చేరి, టిక్కెట్ తెచ్చుకొని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు స్థానిక ఎంపీ అయినా కల్వకుంట్ల కవితను ఓడించడంతో తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే..మొదటినుంచి కెసిఆర్ ను కల్వకుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వ్యంగస్త్రాలతో, సూటి పోటి మాటలతో రాష్ట్రవ్యాప్తంగా సుపరిచితుడయ్యాడు. అంతే స్థాయిలో వివాదాస్పదడు కూడ అయ్యాడు. ఎవరికి కొరకరాని కొయ్యగా ఇంటాబయట తయారయ్యాడు, అనుకున్నదే చేయడం ఎవరికీ వినని వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు.
గత శాసనసభ ఎన్నికలలో నిజామాబాద్ పార్లమెంటరీ పరిధిలోని ఏడు స్థానాలలో కోరుట్ల లో తాను ఓటమి చెందినప్పటికీ, నిజామాబాద్ అర్బన్. ఆర్మూర్ ల్లో విజయం సాధించడమే కాకుండా 4,82,000 పైగా ఓట్లను సాధించడం అతనికి ప్లస్ పాయింట్ గా మారాయి. అయితే ఈసారి అతనికి టిక్కెట్ రాదని గెలవడని పార్టీలోనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.అయితే స్థానికంగా వ్యక్తిగతంగా ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ,మొదటి దఫాలోన్ టికెట్ తెచ్చుకొని బరిలో నిలిచారు.
మరి సర్వేలు ఏమి చెపుతున్నాయి?
విచిత్రంగా ఈసారి ముస్లింలు, క్రిస్టియన్ తదితర మైనార్టీలు 90% పైగా కాంగ్రెస్ పార్టికి ఓటు వేయడం, అంతే కాకుండా హిందువులలో కొన్ని వర్గాలు కాంగ్రెస్ కూడ ఓట్లు వేశారనే చర్చ జరుగుతుంది. దీంతో జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకే ఆదిక్యం ఉన్నదని, జీవన్ రెడ్డి గెలవబోతున్నడని, ఎన్నికలు జరిగినా మూడు నాలుగు రోజుల నుంచి అరవింద్ కచ్చితంగా వోడి పోతున్నాడనే చర్చ భారీగా జరుగుతుంది. అయితే ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున యువత బీసీ వర్గాలు ముఖ్యంగా మెజార్టీ మహిళలు మరియు బిఆర్ఎస్ ఓటు బ్యాంకు చాలా వరకు బిజెపికి ఓటు వేశారని తెలుస్తుంది. ఫలితంగా మెజార్టీ పై స్పష్టత లేకపోయినప్పటికీ మోడీ వేవ్ మూలంగా అరవింద్ ఖచ్చితంగా బయటపడవచ్చని పలు సర్వేలు చెప్పుతున్నాయి. ఉత్తర తెలంగాణలో మోడీ వేవ్ ఉన్న మాట కాదనలేని సత్యం. ఈ వేవ్ లోనే అతను కచ్చితంగా విజయం సాధిస్తాడని బిజేపి నాయకుల గట్టి నమ్మకం.