జూన్‌లో లాన్సెట్ గ్లోబల్ హెల్త్ కి సంబంధించిన నివేదిక ప్రకారం భారతదేశ జనాభాలో సగం మందిపై పైగా వ్యాయామం చేయడానికి బద్దకిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా వీరి జీవితం లేదు. దేశంలో , వ్యాయామం, శారీరక శ్రమ, కసరత్తు తగ్గుముఖం పట్టిందని నివేదిక పేర్కొంది. 2000 సంవత్సరంలో 22 శాతం ఉంటే 2022 నాటికి 49.4 శాతానికి చేరుకుంది. దీని ప్రకారం భారతదేశ జనాభాలో దాదాపు సగం మంది వ్యాయామం చేయడం లేదు. మహిళలు (57%) , పురుషులు (42%) వ్యాయామానికి దూరంగా ఉంటున్నారు.
Dr keshavulu MD psy Osm, Chief Neuro-psychiatrist. Hyderabad & Nizamabad.