Thursday, March 13, 2025

బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించక పోతే….. ప్రభుత్వాలకు సహాయ నిరాకరణ చేద్దాం ! తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ కేశవులు.

దేశంలో ఉన్న దాదాపు 2600 బిసి కులాలలో స్వాతంత్ర్యం వచ్చిన ఈ 78 సంవత్సరాలలో కేవలం 65 కులాలు మాత్రమే పార్లమెంటు, అసెంబ్లీలో అడుగుపెట్టాయని. మన దేశ జనాభాలో బీసీ లు 56% ఉన్నప్పటికి పార్లమెంటులో 15% కూడ బలం లేదు.. 29 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాల నుంచి ఒక్క బీసీ ఎంపీ కూడ లేకపోవడం సిగ్గుచేటని. దేశంలో 40 శాతం సంపద 1% మంది చేతిలో ఉందని, 56 శాతం జనాభా గల బీసీ లో చేతిలో మాత్రం 5 శాతం కూడ లేకపోవడం బాధాకరమని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ రిజర్వేషన్లు కల్పించక పోతే అహింసా మార్గంలో సహాయ నిరాకరణఉద్యమాన్ని చేయాల్సిందేనని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ మరియు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బి కేశవులు అన్నారు.

నిజామాబాద్ నగరం లోని ప్రెస్ క్లబ్ లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన ” స్థానిక సంస్థల ఎన్నికలు – బీసీ లకు రిజర్వేషన్లు ” అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ బి కేశవులు హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా డాక్టర్ బి కేశవులు ప్రసంగిస్తూ…మొదటి నుంచి కూడ చాలా ప్రధాన పార్టీలు వెనుకబడిన తరగతుల కోసం కొన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం, విద్య మరియు ఉద్యోగాలలో బొటాబొటి రిజర్వేషన్లు కల్పించడం ,కొందరు బీసీ నేతలకు నేతలకు కొన్ని అప్రధానమైన శాఖలు ఇచ్చి తమ ప్రచారానికి వాడుకుని వదిలేస్తున్నాయనీ. విద్యా, సామాజిక, ఆర్థిక, రాజకీయ హోదా వంటి అన్ని రంగాలలో బీసీ లు అనాదిగా వివక్షకు గురవుతున్నారనీ. భారీ వివక్షను తొలగించేందుకు అణచివేయబడిన ఈ తరగతులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలనీ. ఇలాంటి చీప్ జిమ్మిక్కులు 56% ఉన్న బిసి ల వెనుక బాటు తనాన్ని కానీ , సమస్యలను కానీ ఏమాత్రం పరిష్కరించలేవని,వెనుకబడిన తరగతులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించకపోతే, వారు అభివృద్ధి చెందలేరనీ మరియు వారికి సహజ న్యాయం అందించలేరనీ. రాజకీయ సీట్ల రిజర్వేషన్లు బీసీలకు అధికారానికి ప్రవేశ ద్వారం. కాబట్టి బీసీలకు రాజకీయ స్థానాల్లో రిజర్వేషన్లు మాత్రమే బీసీ కులాలకు న్యాయం చేయగలవని డాక్టర్ కేశవులు వివరించారు.

ఏ సమానత్వ సమాజంలోనైనా అన్ని వర్గాల మధ్య అధికారం సమానంగా పంచబడాలి. వెనుకబడిన తరగతులకు రాజకీయాలలో అధికార వాటా ఇవ్వకపోతే, ఈ వర్గాలు సామాజికంగా మరియు ఆర్థికంగా పురోగమించలేవనీ. భారత రాజ్యాంగం నేటి వరకు 121 సార్లకు పైగా సవరించబడింది, కానీ జనాభాలో 56% ఉన్న వెనుకబడిన తరగతులకు విద్య, ఉపాధి, ఆర్థిక, సామాజిక మరియు రాజకీయ ప్రయోజనాలను అందించడానికి కనీసం ఒకసారైనా సవరణకు నోచుకోలేకపోవడం బాధాకరమని డాక్టర్ కేశవులు త్రీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

అనాదిగా ఆర్థిక శక్తి, రాజకీయ శక్తి మరియు సామాజిక సాంస్కృతిక స్థితి మొదలైన అధికారాలపై దాదాపు గుత్తాధిపత్యం అగ్రవర్ణాల వారిదే. వెనుకబడిన తరగతులకు చట్టసభలు మరియు ప్రభుత్వ యంత్రాంగంలో రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేయడం అధికారం మరియు హోదాను అనుభవించడం కోసం కాదు. సమాజంలో వారి దీర్ఘకాల వాటాను కలిగి ఉండటం, అణగారిన తరగతుల చట్టాల నిర్ణయంలో పాల్గొనడం ఏకైక అంతిమ లక్ష్యం కావాలని , దాన్ని సాధించేందుకు అసెంబ్లీ మరియు పార్లమెంట్ మరియు స్థానిక సంస్థల ఎన్నికలలో వెనుకబడిన తరగతులకు 50% రిజర్వేషన్ల బిల్లుపెట్టి ప్రభుత్వాలు తమ నిజాయితీని నిరూపించుకోవాలని డాక్టర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డాక్టర్ కేశవులు డిమాండ్ చేశారు.
ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్, ప్రముఖ బీసీ నాయకులు బాసరాజేశ్వర్, సబ్బని లత……………. ఇతరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img