దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్‌సభ స్థానాల్లో మహాశయ ఓటరు ఎటువంటి తీర్పు ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సంచనాలు జరగబోతున్నాయని పలు సర్వేలు చెప్పడంతో తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు టెన్షన్ మరింతగా పెరిగిపోతుంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్. లోక్‌సభ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లు గెలుస్తామని, బీఆర్‌ఎస్ పార్టీ బలహీనపడటం తమకు కలిసివస్తుందని భావించారు. తీరా ఓటింగ్ సరళి చూసీన తర్వాత కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ మొదలయింది.
గత ఏడాది నవంబర్ ఎన్నికల్లో తమకు ఓటు వేసినవారిలో దాదాపు 30 శాతం మందికి బీజేపీకి ఓటు వేశారని.. మరోవైపు బీఆర్‌ఎస్ ఓటు కూడ బీజేపీకే భారీగా బదిలీ అయినట్లు తెలుస్తోంది. దీంతో 8 సీట్లలో అయినా గెలుస్తామా లేదా అనే అనుమానంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారట. మరోవైపు 2019లో గెలిచిన నాలుగు సీట్లకు అదనంగా ఎన్ని గెలిచినా బోనస్‌గా వచ్చినట్లేనని, ఎన్నికల పోలింగ్ ముగిసన తర్వాత పోలింగ్ సరళి.. పార్టీ శ్రేణుల నుంచి అందుతున్న నివేదికల తర్వాత బీజేపీ డబుల్ డిజట్ సీట్లు సాధిస్తుందనే నమ్మకం పార్టీ నేతల్లో పెరిగిందట.
మైండ్ ఎటు వైపు ?
తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. హిందువుల ఓట్లను పోలరైజ్ చేసేందుకు కమలం పార్టీ ప్రయత్నించింది. అదే సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా ముస్లింల ఓట్లు తమకు పడేలా కాంగ్రెస్ వ్యూహం రచించింది. ఎంఐఎం పోటీలో లేని స్థానాల్లో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్‌కు ఓటేయ్యాలని ఎంఐఎం అధినేత ఓవైసీ పరోక్షంగా చెప్పారు. ముస్లింల ఓట్లు పోలరైజ్ అవుతున్నప్పుడు హిందువులంతా ఐక్యంగా ఓటేయ్యాలని మైండ్ మార్చుకోవడంతో కాంగ్రెస్‌కు నష్టం కలిగించే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ప్రస్తుతం తెలంగాణలో బిజెపి దాదాపు 8 సీట్లకు పైగా సాధిస్తుందనే చర్చ రాజకీయ సర్కిల్లో భారీగా జరుగుతుంది. ఓటర్ మూడ్ ఏటు వైపు ఉన్నదో అనేది ఓట్ల లెక్కింపు రోజు జూన్ 4 న బయటపడనుంది. అంతవరకు సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంటుంది…,