టీ టైమ్స్ హైదరాబాద్ ప్రతినిధి; కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ కొద్ది క్షణాల క్రితం మరణించారు, ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. డి శ్రీనివాస్ 1948 సెప్టెంబర్ 27 న నిజామాబాద్ జిల్లాలో జన్మించారు.
అతని చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీ గా కొనసాగుతున్నారు. రెండవ కుమారుడు సంజయ్ నిజాంబాద్ మొదటి కార్పొరేషన్ మేయర్ గా కూడా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లో డి శ్రీనివాస్ పలు శాఖల మంత్రులుగాను, రెండు దఫాలుగా ఆంధ్రప్రదేశ్ పిసిసి చీప్ గా కూడ కొనసాగారు. మృతి వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంధువులు అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఇదిలా ఉండగా డి.ఎస్ కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు తగిన ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ సెక్రటరీ నీ ఆదేశించారు..
#pccchief# Cmrevanthreddy#Dsrinivas#DS#Dsrinivasdeath#