Saturday, March 15, 2025

ఫస్ట్ టైం అట్టర్ ఫ్లాప్ – తర్వాత టాప్ ర్యాంక్, పేదరికం,ఫెయిల్యూర్ లు విజయానికి అడ్డు గోడలు కావు. ప్రతి ఒక్కరూ చదవాల్సిన కథ ఇదీ…

Telangana Times Hyderabad : పేదింటి కుర్రోడు దేశ అత్యున్నత పరీక్షను ఛేదించాడు. ఆల్ ఇండియాలో 27వ ర్యాంకు సాధించి, తెలంగాణ రాష్ట్రానికే వన్నె తెచ్చారు, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోడానికి పేదరికం, ఫెయిల్యూర్, ఖరీదైన కోచింగ్ లు అడ్డుకావని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన నందాల సాయికిరణ్ ఉద్యోగం చేస్తూనే సివిల్స్ క్రాక్ చేసీ నిరూపించారు.

కుటుంబ పెద్ద దిక్కు లేకుండానే ….

చేనేత  కార్మికుల కుటుంబంలో జన్మించిన సాయికిరణ్ ప్రైమరీ విద్య, హైస్కూల్ విద్య, ఇంటర్ విద్య కూడ స్వంత జిల్లాలోనే చదివారు.వరంగల్ ఎన్ఐఐటీలో ఇంజినీరింగ్ చదువుతున్న రోజుల్లోనే తండ్రి కాంతారావు చేనేత కార్మికునిగా పనిచేస్తూ క్యాన్సర్ బారినపడి 2016లో మృతి చెందాడు.తల్లి లక్ష్మి బీడీ కార్మికురాలు, కుటుంబ పెద్ద దిక్కు లేకుండానే బీటెక్ పూర్తి చేసి, హై దరాబాద్ లో మల్టినేషన్ సాఫ్ట్ వేర్ కంపెనీ లో పని చేస్తూనే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కు ఆన్ లైన్ కోచింగ్ తీసుకుంటూ ప్రయత్నించాడు, తొలి ప్రయత్నంలో పూర్తిగా విఫలమైన సాయి, రెండో ప్రయత్నంలో మాత్రం టాప్ పొజిషన్ లో 27వ ర్యాంక్ సాధించి సక్సెస్ అయ్యారు.

పేదరికం,ఫెయిల్యూర్ లు అడ్డు గోడలు కానే కావు…

ఇప్పటికీ చాలామంది యువత భ్రమల్లో బతుకుతూ తమ కుటుంబం ఆర్థిక పరిస్థితులు బాగా లేవని, కోచింగ్ సెంటర్లకు వెళ్ళ స్థితిలో లేమని, యూపీఎస్సీ కష్ట తరమైన పరీక్షలనీ, అపర మేధావులకు మాత్రమే సాధ్యమవుతుందని కథలు చెబుతూ టైం వృధా చేస్తూ కాలం వెళ్ళ బుచ్చుతున్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన సాయి, చదువుకు పేదరికం అడ్డుకాదని కష్టపడి చదివాడు. తల్లిదండ్రుల కష్టంలో పాలు పంచుకుంటూ చిన్నప్పటి నుంచే కలెక్టర్ కావాలనే లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగి సక్సెస్ అయ్యాడనీ, వాళ్లందరికీ కిరణ్ కుమార్ ను ఒక రోల్ మోడల్ గా తీసుకోనీ. ఇష్టం తో, నిజాయితీగా,ఒక లక్ష్యం పెట్టుకోని, ముందుకెళ్ళితే పేదరికం,ఫెయిల్యూర్ లు అడ్డు గోడలు కానే కావనీ, కచ్చితంగా విజయం సాధిస్తారనీ ప్రఖ్యాత మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బి కేశవులు ఎండీ అంటున్నారు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img