మద్యపానం ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. అయినా మద్యం వినియోగం పెరుగుతూనే ఉంది. చాలా మంది తక్కువగా మద్యం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని అనుకుంటున్నారు. లైట్- మోడరేట్ డ్రింకింగ్ (Light, Moderate Drinking) గుండె ఆరోగ్యానికి మంచిదని, ఆయుష్షును పెంచుతుందని నమ్ముతున్నారు. అయితే ఇలాంటి వాదనల్లో నిజం లేదని తాజా పరిశోధనలు తేల్చేశాయి.
తక్కువగా తాగినా క్యాన్సర్ రిస్క్ : మగవారు డైలీ 20 గ్రాములు, ఆడవారు 10 గ్రాముల ఆల్కహాల్ తాగితే, ప్రమాదం లేదని చాలా మంది చెబుతారు. మద్యం కొంచెం తాగినా శరీరానికి చాలా హాని కలుగుతుందని, ప్రాణాంతకమైన క్యాన్సర్ (Cancer) లాంటి వ్యాధులు తలెత్తవచ్చు అని కొత్త స్టడీ బాంబు పేల్చింది.
ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు బ్రిటన్‌లో లక్ష మందిని పైగా 12 ఏళ్ల పాటు…లైట్, మోడరేట్ ఆల్కహాల్ డ్రింకింగ్ వల్ల కలిగే సమస్యల గురించి పరిశోధన చేశారు.
మొదటి చుక్క మద్యం తాగినప్పటి నుంచే క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుందని అధ్యయనం ద్వారా తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. తక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకునే అలవాటుతో ప్రయోజనాల లభిస్తాయని చెప్పడానికి ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు లభించలేదు Jama network open లో ఈ ఫలితాలను పబ్లిష్ చేశారు.
మరోవైపు మద్యం తక్కువ తాగడం ఎక్కువ తాగడం కంటే అసలు తాగక పోవడమే మంచిదని అమెరికన్ హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అమెరికాలో ఆల్కహాల్ ఎక్కువగా తాగి చనిపోయే వాళ్ల సంఖ్య గత కొన్ని సంవత్సరాల్లో 30 శాతం పెరిగింది.
Dr keshavulu MD psy 0sm. Chief Neuro - psychiatrist. Hyderabad & Nizamabad.