నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల డాక్టర్ల పై ఇతర శాఖల అధికారులతో అక్కడి కలెక్టర్ పరిశీలన చేయించడం ఎంత మాత్రం మంచిది కాదని, ఒక రకంగా ఒక శాఖపై ఇంకో శాఖ ఆధిపత్యం చెలాయించడమేనని సీనియర్ మానసిక వైద్య నిపుణులు మరియు తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ బి.వి. కేశవులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేసి వైద్య శాఖలపై వేరే శాఖల ఆధిపత్యాన్ని ఉపసంహరించుకోవాలని, ఇలా చేయడము వైద్యులందరినీ అవమానించడమేనని, ఇది వైద్యులు ఎంత మాత్రమూ సహించబోరని, పైగా వైద్యుల ఆత్మగౌరాన్ని తాకట్టు పెట్టడమేనని…. అలాంటి పరిస్థితులలో వైద్యులు వైద్య కళాశాలలో పనిచేయడానికి ఎవరు ముందుకు రారని… ఈ చర్యలు విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డాక్టర్ బి వి కేశవులు డిమాండ్ చేశారు..
రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాల బోధన సిబ్బందికి తెలంగాణ మేధావుల సంఘం పూర్తిగా మద్దతిస్తుందని… అయితే వైద్య సేవలు నిలిచిపోకుండా చూడాల్సిన బాధ్యత కూడ సంఘం పైన ఉందని డాక్టర్ బి. వి. కేశవులు గుర్తు చేశారు.