మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. కానీ చాలా మంది అవి ఏవి పట్టించుకోకుండా ఎక్కువగా డ్రింక్ చేస్తుంటారు. అయితే కొంత మంది పార్టీలు, ఫంక్షన్స్ టైమ్‌లో ఎక్కువ మద్యం సేవిస్తే, ఇంకొంత మంది ప్రతి రోజూ మద్యం తాగుతూనే ఉంటారు.
ముఖ్యంగా కొంత మంది విపరీతంగా మద్యానికి అలవాటు పడతారు. అసలు ఆల్కహాల్ వ్యసనంలా ఎలా మారుతుంది. దీనికి ఎందుకు వ్యక్తులు ఎక్కువగా అడెక్ట్ అవుతున్నారో అనే విషయం పై లండన్ కింగ్స్ కాలేజ్ పరిశోధకులు ఓ సర్వే చేశారు. ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ఒక అధ్యయాన్నిప్రచురించిగా అందులో షాకింగ్ విషయాలు తెలిసాయి.
ఆర్‌ఎఎస్టిఆర్ఎఫ్ 2 అనే జన్యువు ప్రజలను మద్యపాన ఆనందాన్ని ప్రభావతం చేస్తుందంట. దీని వలన వ్యక్తి మద్యపానం పదే పదే తాగాలనిపిస్తే, వ్యసనంలా మారుతుందంట. అంతే కాకుండా మన మెదడులో ఉండే ఆనందంతో సంబంధం ఉన్న న్యూరోట్రాన్స్మిటర్ మనకు రుచికరమైన, నచ్చిన ఫుడ్ తిన్నప్పుడు డోపామైన్ స్థాయిలు పెరిగి పోయేలా చేస్తుంది. దీంతో అదే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అలా మద్యం సేవించేటప్పుడు కూడా డోపామైన్ స్థాయిలు పెరిగిపోయి, కొందరు మద్యానికి వ్యసనంలా మారిపోతున్నారని తెలిపింది.
Dr keshavulu MD psy 0sm, Chief Neuro-psychiatrist & Chairman: National anti -drugs Organisation.