తెలంగాణ రాష్ట్రం నుంచి బిజెపికి గతంలో కంటే రెట్టింపు సంఖ్యలో లోక్ సభ సభ్యులు గెలవడం ఎనలేని సంతోషాన్నిస్తుంది. మూడోసారి కూడ బిజెపి యే ప్రభుత్వం ఏర్పాటు చేయడము… దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో బిజెపి బలపడటం మనకు తెలిసిందే… ఫలితంగా కేంద్ర మంత్రివర్గంలో 2-3 స్థానాలు ఖాయమనే ప్రచార నేపథ్యంలో అగ్ర నేతలను ప్రసన్నం చేసు కోవడానికి చాలామంది ఆశావాహులు ఢిల్లీ లో మకాం వేశారు,
అయితే తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో అధికారంలోకి రావడం కొరకు బీజేపి ప్రత్యేక ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రిగా మళ్ళీ కిషన్ రెడ్డిని కొనసాగించడం, సహాయ మంత్రిగా బండి సంజయ్ సేవలు వాడుకోవడము, రాష్ట్రంలో రాజకీయ , అనుభవం కల మెజార్టీ బీసీ వర్గానికి చెందినవ్యక్తిగా, కెసిఆర్ ప్రభుత్వంలో నెంబర్ టు గా కొన సాగడం, తెలంగాణ ఉద్యమకారునిగా గుర్తింపు గల ఈటెల రాజేందర్ ని ముందు పెట్టి వచ్చే ఎన్నికలలో కచ్చితంగా బిజెపి అధికారంలోకి రావడానికి ఈటల వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తుంది,ఈటల రాజేందర్ ని పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించడం ఖాయమనే వార్తలు రాజకీయ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. మహిళా కోట నుంచి డీకే అరుణకు వేరే అధికార పదవిలో సమన్వయం చేయనున్నట్లు తెలుస్తుంది..