టీ టైమ్స్ ప్రత్యేక ప్రతినిధి సురేందర్ర్ రెడ్డి : కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ఏటీఎం అంటూ ప్రధానమంత్రి తో సహా అన్ని పక్షాలు తెలంగాణలో కోడై కూసిన సంగతి మనందరికీ తెలిసిందే , లక్ష కోట్ల అవినీతి జరిగిందని కేంద్రంలో ఉన్న బీజేపీ పంపిన నోటీసులు కాదు…….రాష్ట్రంలో కాంగ్రెస్ వేసిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ విచారణ కమిషన్ పంపిన నోటీసులు కాదు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సామాజిక బాధ్యతతో ఒక వ్యక్తి వేసిన కేసుకు కోర్టు స్పందించి పంపిన నోటీసులు.రాజకీయానికి సామజిక బాధ్యతకు తేడా ఉంది అనేది స్పష్టం. అవినీతిని వెలికితీయడానికి అధికారం, అన్ని వ్యవస్థలు ఉండి కూడా రాజకీయం చేస్తూ పూట గడుపుతున్న ప్రభుత్వాలకు ఒక పౌరునికి ఉన్న తేడా ఇదే. ఊహించని పరిణామంతో గులాబీ శ్రేణులు కంగుతున్నాయి.