భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షునిగా తెలంగాణకు చెందిన కే .లక్ష్మణ్ నిర్ణయమైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే పార్లమెంటరీ బోర్డు మెంబర్ గా, తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులుగా పలు మార్లు పనిచేసిన లక్ష్మణ్.. వివాద రహితుడు. సౌమ్యుడు. మొదటి నుంచి పార్టీలోనే కొనసాగుతున్న సీనియర్ వ్యక్తి కావడం ముఖ్యంగా దక్షిణాది ప్రాంతం నుంచి అధ్యక్షులు చేయాలని , దక్షిణాది ప్రాంతంలో పార్టీని మరింత ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే లక్ష్మణ్ ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే ప్రకటన రావొచ్చని ఢిల్లీ నుంచి అందిన అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన వార్త ఇది..