తెలుగు రాష్ట్రాలలో ఫిరోజ్ ఖాన్ అనే పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. పుట్టుకతో ముస్లిం ఐనప్పటికీ ముస్లిం ల కంటే మెజారిటి హిందువుల మనసులోనే చెరుగని ముద్ర వేసుకున్న అభ్యుదయ వాది ఈ ఫిరోజ్ ఖాన్, జైశ్రీరామ్.. జై హనుమాన్ …అంటూ హిందూ దేవుళ్లను గౌరవించే ఉదారవాదీ గా అందరి మనసులో నిండి పోయాడు.ఏ విషయమైనను కుండ బద్దలు కొట్టే చెప్పే ధైర్యశాలిగా, ఏ లాంటి అవినీతి ఆరోపణ లేకుండా నికార్సైన నాయకునిగా మంచి గుర్తింపు ఉన్న నాయకుడు ఫిరోజ్ ఖాన్… పాతబస్తీలో ఎంఐఎం పార్టీ ఆ గడాలను, అరాచకాలను , దొంగ ఓట్లను ప్రజల దృష్టికి,ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తూ ఎన్నికలలో పలు సార్లు ఓటమి చెందినప్పటికీ బాధపడకుండా, వెనుతిరగకుండా అలుపెరుగని పోరాట యోధునిగా కీర్తించబడుతున్నాడు, ముస్లిం లో కంటే హిందువుల జనాభాలోనే ఎక్కువ గౌరవము , అభిమానము మంచి ఫాలోయింగ్ ఉంది .
మోదీ 18 గంటలు కష్టపడుతున్నాడు ….. ఫిరోజ్ ఖాన్.
కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉండి కూడ మోది రోజు కు 18 గంటలు కష్టపడి పని చేస్తున్నాడని, అవినీతి ఆరోపణలు లేకుండా నిజాయితీ గా దేశ విదేశాల్లో మంచి మార్కులు తెచ్చు కుంటున్నాడని, రాహుల్ గాంధీ మోది తో సరితూగలేడని బహిరంగంగా మాట్లాడడం కేవలం ఫిరోజ్ ఖాన్ కే స్వంతం. బహుశా బీజేపి వాళ్ళకంటే మోది గురించి గొప్పగా మాట్లాడుతున్న తీరు బిజేపీ అగ్ర నాయకత్వానికి బాగ నచ్చిందట, మా మతం కూడ దేశాన్ని ప్రేమించుమనే చెప్పుతున్నదని, ముస్లిం జనాభా ఏ మతానికి వ్యతిరేకం కాదని, అన్నీ మతాలను గౌరవించుమని చెప్పుతున్నాదని సూడో సెక్యులరిస్టులు కు గట్టిగా జవాబులు ఇస్త్తున విధానం బీజేపి అగ్రనేతలకు బాగా నచ్చిందని టాక్. ఇన్నీ మంచి లక్షణాలు ఉన్న ఫిరోజ్ ఖాన్ ను కాంగ్రెస్ పట్టించుకోవడంలేదని విషయం తెలుసుకున్న బిజెపి రంగ ప్రవేశం చేసి మాట్లాడినట్టు తెలుస్తుంది,
ఎం ఐ ఎం తో దోస్తీ తో నారాజ్ … ఆచితూచి అడుగులు….
ఎంఐఎంతో రేవంత్ రెడ్డి చేతులు కలపడంతో ఫిరోజ్ ఖాన్ సైలెంట్ అయిపోయాడు, ఇటువంటి పరిస్థితులను గ్రహించిన ఫిరోజ్ ఖాన్ బీజేపీ లో చేర్చుకుంటే బీజేపీ కీ అదనపు ప్రయోజనం ఉంటుందని అగ్ర నాయకత్వం ఆలోచిస్తోంది. దక్షిణ భారత నుంచి మంచి వాగ్దాటి ఆకర్షణ గల యువకుడు కావడం అన్ని వర్గాలలో మంచి పేరు ఉండటం, అటు మైనార్టీ, ఇటు మెజార్టీ హిందువుల నుంచి కూడా పార్టీకి లాభం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అగ్ర నాయకత్వం ఆలోచిస్తోంది , కర్కాటక రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యునిగా తీసుకొని, కేంద్రం లో మైనార్టీ శాఖ సహాయ మంత్రి పదవి ఇవ్వడానికి ఆఫర్ చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మధ్య ఒక బీజేపీ ఎంపీ కూడ ఫిరోజ్ ఖాన్ కు కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వకపోవడంపై విస్మయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాతే ఫిరోజ్ ఖాన్ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అప్పటివరకు యధాస్థితిని కొనసాగించే సూచనలే ఉన్నాయనే టాక్ బయట వినిపిస్తోంది.