Sunday, March 9, 2025

తెలంగాణ రాజకీయంలో రాముడి భజన! కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ భయపడ్డాయంటున్న బీజేపీ!

తెలంగాణలో రాజకీయం దేవుడి చుట్టూ తిరుగుతోంది. పార్లమెంట్‌ ఎన్నికలకు లోకాభిరాముడే ప్రధాన ఎజెండా అవుతున్నాడు. మారుతున్నాడు.
ఇన్నాళ్లూ బీజేపీ పేటెంట్‌గా భావించిన జై శ్రీరామ్‌ నినాదాన్ని.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు సైతం భుజానికెత్తుకోవడం ఆసక్తికర రాజకీయాలకు కారణమవుతోంది. రాముణ్ని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం అంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పిలుపునివ్వడం.. రాముడు మాకూ దేవుడే అంటూ కాంగ్రెస్‌ కౌంటర్‌ ఇవ్వడం.. ఈలోగా జగ్గారెడ్డి రామకీర్తనలు అందుకోవడం.. ఇదంతా కూడా పాలిటిక్స్‌లో సరికొత్త మలుపుగా చెప్పొచ్చు. మొత్తంగా తెలంగాణ రాజకీయం-అంతా రామమయం అన్నట్టుగా మార్చేశారు.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img