తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో దళితులకు ముఖ్యంగా మాదిగ జాతికి కనీసం ఒక్క సీటు కేటాయించకపోవడం చాలా అన్యాయమని,ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు సరియైన రీతిలో సామజిక న్యాయం చేయకపోతే కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నడం ఖాయమని, ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం మంచిది కాదని సీనియర్ దళిత నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు.
ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, కెసిఆర్ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఎవరికి అందవని, చివరికి కేసీఆర్ కూడ రెండు ఎంపి టిక్కెట్ లు మాదిగ జాతికి ఇచ్చారని,ఇటువంటి పరిస్థితులలో కేసీఆర్ గురించి తెలిసిన సీనియర్లను ఉపయోగించుకోవాలని , అంతగా అనుభవము లేని రేవంత్ రెడ్డి మరీంత జాగ్రత్తగా ఉండాలని మోత్కుపల్లి హెచ్చరించారు.
….