
T.times Correspondent Hyderabad : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బోధన వైద్యుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ క్రిటికల్ కేర్ స్పెషలిస్టు, ప్రొఫెసర్ కిరణ్ మాదాల ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. కరోనా సమయములో అనేక పత్రికలలో కరోనా జబ్బు గురించి, తాజా విశేషంశాలను, వైద్య విధానాలను, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి పెద్ద ఎత్తున ప్రజలకు సేవలందించారు. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కరోనా జబ్బుల గురించి ప్రత్యేకమైన సర్టిఫికెట్ కోర్స్ ని కూడా పొందారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని తెలుగు పత్రికలలో క్రిటికల్ కేర్ జబ్బుల గురించి పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు,
తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం ఎన్నికల ఫలితాలను ఆదివారం రాష్ర్ట స్థాయీ సమావేశంలో ప్రకటించారు, అధ్యక్షులుగా డాక్టర్ కిరణ్ కుమార్ , సేక్రటరీ జనరల్ గా డాక్టర్ కిరణ్ మాదాల, కోశాధికారికా డాక్టర్ ఎల్ రమేష్ , వైస్ ప్రసిడెంట్ గా డాక్టర్ కిరణ్ ప్రకాష్ తో పాటు ఏడు జోన్లకు ప్రాంతీయ కార్యదర్శి, కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకొన్నారు,వైస్ ప్రెసిడెంట్ MZ 1 డాక్టర్ సుమలత, వైస్ ప్రెసిడెంట్ MZ 2 గా డాక్టర్ కిరణ్ ప్రకాష్, డాక్టర్ బాబు,డాక్టర్ గిరిధర్, డాక్టర్ పాల్గుణ్ ,డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సుధీర్, డాక్టర్ శ్రీవాంత్, డాక్టర్ కరుణాకర్ లు జోనల్ సెక్రటరీగా నియమించబడ్డారు, అలాగే ఏడుగురుని ఎక్సిక్యూటివ్ మెంబర్గ గా కూడ ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ మాదాల మాట్లాడుతూ తమ సంఘం ప్రభుత్వ వైద్యుల తరఫున పనిచేస్తుందని, అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల పని తీరు పెరుగుదలకు కూడా కృషి చేస్తామని, రోగులకు వైద్య ఆరోగ్య పరంగా మరింతగా కష్టపడతామని హామీ ఇచ్చారు. అలాగే అధ్యక్షులు కిరణ్ బొల్లెపాక మాట్లాడుతూ బోధనా వైద్యుల బదిలీలు వైద్యుల వేతనాల స్థిరీకరణ తదితర సమస్యల సాధనకు కృషి చేయనున్నట్లు ఈ సందర్భంగా సంఘమును పలువురు డాక్టర్లు అభినందించారు.