దేశంలో పార్లమెంట్ కి జరిగిన ఎన్నికలు పూర్తయ్యాయి..చివరికి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడ వచ్చేసాయి. దేశ నాయకత్వం లో మార్పు ఉండబోదని, కొన్ని రాష్ట్రాలలో ఫలితాలు తారు మారు కావొచ్చని కొన్ని సర్వేలు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాలలో మాత్రము ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల అయ్యాక కూడ అదే సస్పెన్షన్, అదే నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. బెట్టింగ్ రాయులకు మరింత ప్రాణం పోసినట్టు అయింది.
గత నవంబర్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికలలో.. కెసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిందానికంటే కెసిఆర్ కుటుంబం సంపాదించినదే ఎక్కువనే విషయము ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా నాటుకు పోయింది. కెసిఆర్ ఇచ్చే పథకాల డబ్బు అది మన డబ్బేనని అప్పుల రూపం లో తీసుకొచ్చి మనకు ఇస్తున్నాడే తప్ప…ఇంట్లో నుంచి తీసుకురావడం లేదని,అంతే కాకుండా కొందరి నాయకుల అహంకారము, ప్రజలను పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు తీవ్రంగా విసుగెత్తడం,ఎవరి మీదనైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకం పెట్టుకున్న మహిళ లబ్ధిదారులే టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేయడంతో నాడు కాంగ్రెస్ అధికారం లోకి వచ్చినది.
విచిత్రంగా కాంగ్రెస్ పార్టీ కూడ అదే మహిళలకు పలు పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ,ఆ పథకాల డబ్బు సొమ్మంతా మా ప్రజలదేనని, 100 రోజుల్లో ఇస్తానన్న మిగతా పథకాలు ఇవ్వకపోవడం కూడ, మహిళలను నిరాశపరిచింది,అంతకంటే ముఖ్యంగా అయోధ్య రాముని అక్షంతలు, పురుషుల కంటే మహిళలే ఎక్కువగా పూజలు పునఃస్కారాలు చేయడము, ఏక ప్రతివత్యుడైన రాముని పై మహిళలకు భారీవిశ్వాసం, నమ్మకం ఉండటం, ఎన్నికలు దేశం కొరకు జరుగు తున్నాయని, మోదినే గెలిపించాలని గట్టి నిర్ణయం ముందు ఉచిత బస్, గ్యాస్, ఎలక్ట్రిసిటీ ఏవి పనిచేయడం లేదనే చర్చ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ- మధ్య తెలంగాణలో 60 శాతానికి పైగా, దక్షిణ తెలంగాణలో 40% పైగా బిజెపికి వేయడం వల్లనే ఈ రకమైన ఫలితాలు రాబోతున్నాయని సర్వేలు చెప్పడం గమనించదగ్గ విషయం. నాడు కెసిఆర్ ను అధికారంలోకి రావడానికి-అధికారం నుంచి దించడానికి ముఖ్య పాత్ర పోషించిన ఆ మహిళలే నేడు రేవంత్ రెడ్డి ని కూడ ముంచబోతున్నారన్న విషయం ఎగ్జిట్ పోల్ సర్వేల ద్వారా తెలుస్తుంది. ఏది నిజమో ఏది అబద్దమో వచ్చే 36 గంటల్లో తేలిపోతుంది.