తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి నియామకంలో రోజుకొక కొత్త కోణం బయటికి వస్తుంది. ఇంచుమించు పలానా పేరు ఖరారు అయిపోయినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు రావడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ మధ్య బీసీ వర్గానికి మాత్రమే ఇవ్వాలనీ గట్టి నిర్ణయం తీసుకున్నారు , ఫలితంగా బీసీ నాయకుల పేర్లు మాత్రమే చర్చలోకి వచ్చాయి, అందులో మధు యాష్కి గౌడ్, మహేశ్ కుమార్ గౌడ్ మధ్య నువ్వా నేనట్లుగా పోటీ కొనసాగుతుంది, నిన్న సాయంత్రం మాత్రం మహేశ్ కుమార్ గౌడ్ కు ఖాయమనే సంకేతాలు అన్ని మీడియా ఛానల్లో వచ్చాయి.
అన్ని ఛానళ్లలో మహేష్ కుమార్ గౌడ్ పేరు వస్తున్న ఉత్కంఠ భరిత క్షణంలోనే మధు యాష్కి గౌడ్ కి అనుకూలంగా కర్ణాటక డిప్యూటీ సీఎం ఎంట్రీ కావడం జరిగింది, పార్టీకి మొదట్నుంచి విశ్వాసపాత్రుడుగా ఉండటము, పలు రాష్ట్రాలకు పార్టీ ఇన్చార్జిలుగా ఉండి, ఆ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రావడానికి శాయ శక్తుల కృషి చేసిన అనుభవము, కేంద్ర అగ్ర నాయకులతో ఆదినుంచి సత్సంబంధాలు ఉండటము, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడం, ఏనాడు పార్టీని దిక్కరించి మాట్లాడకపోవడం, పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉండటము లాంటి విషయాలను హైకమాండ్ దృష్టికి తీసుకపోవడము జరిగింది, అంతేకాకుండా మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతూ ఉండటం, ఈమధ్యనే ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇవ్వడం తెలిసిందే.
మధు యాష్కీ కి ఏ పదవి లేక చాలా కాలంగా పార్టీ నీ నమ్ముకున్న సత్యాన్ని అగ్రనాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, ఇప్పుడున్న పరిస్థితులలో మంచి వాగ్దాటి గల బీసీ నాయకుడు అతనే కావడం, అతన్ని కాదంటే పార్టీ నుంచి బయటికి వెళ్లి బీసీల పార్టీ స్థాపించే అవకాశాలు ఉంటాయేమోనని… ఇప్పటికే పలు బిసి సంఘాల నుంచి అలాంటి ప్రతిపాదనలు కూడా వచ్చాయని అధిష్టానం తీసుకుపోవటంతో మహేష్ కుమార్ గౌడ్ ప్రకటనను నిలిపివేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.