రాష్ట్ర నూతన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) రథసారధి ఎవరనేది మళ్లీ మొదటికొచ్చింది. అట్లూరి లక్ష్మణ్ కుమార్ పేరు దాదాపుగా ఖరారు చేసిన నేపథ్యంలో కొందరు బీసీ నాయకులు కేంద్ర అధిష్ఠానం వద్దకు వెళ్లి ఇప్పటికే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పదవి, విధాన సభ స్పీకర్ గా దళిత వర్గానికి చెందినవారు ఉండటం, మళ్ళీ పార్టీ అధ్యక్ష పదవి కూడ దళితులకు ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని, నేటి వరకు 56 % పైగా ఉన్న బీసీలకు ఎలాంటి ప్రాముఖ్యత గల అధికార పదవులు లేకపోవడం దారుణమని బీసీ నాయకులు పెద్ద ఎత్తున కేంద్ర అధి నాయకత్వం వద్ద గోడు వెల్లబోసుకున్నట్లు తెలిసింది. దీంతో అగ్ర నాయకత్వం పునరాలోచనలో పడ్డట్టు బిసి నాయకుల నుంచి అందుతున్న సమాచారం .
ఇప్పటికే బిసిలకు మంత్రి పదవుల విషయం కులగణన మరియు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో బిసీల నుంచి పెద్ద ఎత్తున తీవ్ర వ్యతిరేక వస్తున్న నేపథ్యంలో బీసీలకు కాకుండా ఇతరులకు ఇస్తే బీసీల నుంచి పెను ప్రమాదం ఉందని హెచ్చరించినట్లు తెలిసింది.
బీసీ ల నుంచి మధుయాష్కీగౌడ్ లేదా మహేశ్ కుమార్ గౌడ్ కి ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ రాష్ట్ర నాయకత్వం నుంచి మద్దతు లేకపోవడమే మైనస్ పాయింట్ గా మారిందనీ గుసగుసలు వినిపిస్తున్నాయి,, లేనిచో ఇప్పటికే పార్టీ రథ సారథి ఎవ్వరనేది తేలిపోయేది. ఈ విషయంలో అధిష్టానం సీరియస్ గా ఉన్నప్పటికీ కులాల సమీకరణ లెక్కలు తేలకపోవటంతో ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర నాయకత్వం మాత్రం బలరాం నాయక్ లేదా అడ్డూరి లక్ష్మణ్ కుమార్ వైపే మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.