Tuesday, March 11, 2025

పిసిసి చీఫ్ గా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ … మంద కృష్ణ మాదిగ కు చెక్ పెట్టేందుకే అనూహ్య నిర్ణయం…

రాష్ట్ర నూతన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు ఎవరనేది అధిష్టానం నిర్ణయం చేసింది. ఇప్పటికే ఆలస్యం కావడం, స్థానిక సంస్థలు ఎన్నికలు త్వరలో రాబోతుండటం, సిఎం రేవంత్ రెడ్డి పరిపాలనపై పూర్తిస్థాయి దృష్టి పెట్టడం మూలంగా పార్టీని బలోపేతం చేయడం కొరకు నలుగురు కార్యనిర్వాహక అధ్య క్షులు, ప్రచార కమిటీ చైర్మన్లతో నూతన టీపీసీసీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అలాగే మరికొన్ని కార్పొరేషన్లు, సంస్థలకు చైర్మన్ల పేర్లను అధిష్టానం ఆమోదించనున్నట్లు సమా చారం. మంత్రివర్గ విస్తరణకు మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రచార కమిటీ చైర్మన్ గా మధు యాష్ కి గౌడ్ , వర్కింగ్ ప్రెసిడెంట్ గా ( పార్టీ నిర్మాణం ) మహేష్ కుమార్ గౌడ్ అలాగే కొనసాగ గలరని తెలుస్తుంది.

మాదిగ సామాజిక వర్గం నుంచి…..

రాష్ట్రంలో బిజెపి మాదిగ వర్గాన్ని మాదిగ దండోరా వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ద్వారా ప్రసన్నం చేసుకున్న పనిలో ఉంది. అందుకనే మాదిగల వర్గీకరణకు కేంద్రం ఒప్పుకోవడం, మందకృష్ణ మాదిగకు సాక్షాత్ ప్రధాని అత్యంత కీలకమైన పాత్రను ఇవ్వబోతున్న విషయం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా మాదిగ వర్గానికి టికెట్లు ఇవ్వకపోవడం మాదిగల కొంత వ్యతిరేకత ఉన్న వాస్తవాన్ని గ్రహించి, మందకృష్ణ మాదిగకు చెక్కుపెట్టే పనిలో అదే దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కు ఇవ్వడమే సరైన నిర్ణయం అని అధిష్టానం ఒప్పించాడని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

అడ్లూరి పై వ్యతిరేకత లేకపోవడం…

మొదటినుంచి కాంగ్రెస్ పార్టీలో వివిధ విభాగాలలో నిజాయితీగా పనిచేయడం, పార్టీ మారకుండా కష్టకాలంలో కూడా పార్టీ వెన్నంటే ఉండటము వివాద రహితుడు కావడం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కలిసొచ్చే అంశాలు, అంతేకాకుండా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి కావడం , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఇస్తే ఎవరి నుంచి కూడా పెద్ద వ్యతిరేకత వ్యక్తం కాకపోవడం ఇదీ మరో ప్లస్ పాయింట్.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img