Saturday, March 15, 2025

కోల్‌కతా డాక్టర్ హత్యలో కొత్త కోణం…సంజయ్ రాయ్ పావు మాత్రమేనా ? అసలు నేరస్థులు …. ఎవరో తెలుసా ?

Dr keshavulu MD psy 0sm : కోల్ కత్తా మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థిని లైంగిక దాడి అనంతర హత్య కేసు చిక్కుముడి ఇప్పటికీ ఇప్పలేకపోతున్నారు. ఇందులో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, డ్రగ్స్ మాఫియా డాన్ లు, కొందరు హాస్పిటల్ సిబ్బంది హస్తం ఇందులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇది పకడ్బందీ వ్యూహం ప్రకారం చేసిన సంఘటనని, దీని వెనుక పెద్ద తలలు ఉన్నాయని కోల్ కత్తా వాసులను ఎవరిని అడిగినా చెబుతున్న చేదు నిజం.సుప్రీంకోర్టు సీన్ లోకీ ఎంట్రీ కావడంతో అసలు నిజాలు తెలిస్తాయనే నమ్మకం కొందరిలో ఉంది.

అసలు ఆమె ఎక్కడ చంపబడింది ?

సెమినార్ హాల్‌లో తన కూతురు హత్యకు గురైందా లేదా ఆమె వేరే చోట చంపబడి ఉండవచ్చానే సందేహం ఉందని బాధితురాలి తండ్రి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలు సెమినార్ హాల్‌లో ఒంటరిగా ఉందని నిందితుడు సంజయ్‌రాయ్‌కి ఎలా తెలిసిందని రాయ్ ఒక పెద్ద చేప ద్వారా పన్నిన కుట్రలో భాగం కావచ్చని సహోద్యోగి ఒకరు మీడియాతో అనుమానం వ్యక్తం చేశారు.

డ్రగ్స్ రాకెట్ గుట్టు తెలియడం వల్లనే…

ఇది ఇలా ఉండగా మరో సహోద్యోగి తన డిపార్ట్‌మెంట్‌లో మాదక ద్రవ్యాల రాకెట్‌ను బహిర్గతం చేయడానికి బాధితురాలు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. “ఆమెకు ఏదో గురించి చాలా తెలిసి ఉండవచ్చు, అది తెలియకుండా చేయడానికి కొందరు పన్నాగం పన్ని ఈ రకంగా దారుణంగా హతమార్చి ఉంటారని అంటున్నారు. ఆసుపత్రిలోని అత్యవసర భవనంలోని ఛాతీ విభాగం మూడో అంతస్తు సెమినార్ హాల్ సమీపంలో పునర్నిర్మాణం కీలకమైన సాక్ష్యాలను దాచిపెట్టేందుకు ఉద్దేశించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వైద్య విద్యార్థులు కొందరు ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ ఎపిసోడ్ వెనుక చాలామంది పెద్ద తలలు, మాఫియా డాన్లు కొందరు వైద్య సిబ్బంది కూడా ఉన్నట్లు హాస్పటల్ సిబ్బంది చెప్పడం కోసమేరుపు.

సంజయ్ రాయ్ క్రిమినల్ చరిత్ర గలవాడే…

సంజయ్ రాయ్‌పై పోలీసుల విచారణలో అతనిపై దోపిడీ, బెదిరింపులు మరియు మహిళలపై బెదిరింపులతో సహా పలు ఆరోపణలు బయటపడ్డాయి.రాయ్‌పై చాలా కేసులు ఉన్నట్లు కొందరు మాఫియాలతో సంబంధం ఉండటం మూలంగా పెద్ద నాయకులు తెలిసి ఉండటం వల్ల కంటితోడుపు చర్యలతోనే నమోదు కాకుండ తప్పించుకుంటున్నట్లు తెలిసింది.

ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి !

1, సెమినార్ హాల్లో రక్తమడుగులో ఉండి లైంగికంగా దాడి చేయబడ్డ డాక్టర్ , ఆత్మహత్య ఆనవాళ్ళు ఏమి లేకపోయినప్పటికీ ఆత్మహత్యగా చిత్రీకరించి తల్లిదండ్రులకు తెలియజేయడం వెనకాల కళాశాల పెద్దల రహస్య పాత్ర మేమిటో అర్థం చేసుకోండి.

2, సంఘటనకు ఒకరోజు ముందు అమ్మాయి ప్రిన్సిపాల్ గది నుంచి కన్నీళ్లతో వచ్చింది నిజం కాదా ? కాలేజీలో ఉండడం ఇష్టం లేదని తల్లిదండ్రులకు వారం రోజులు ముందు నుంచి చెబుతున్నది నిజం కాదా ?

3, ఆర్జీకర్ హోస్పిటల్ లో హ్యూమన్ ట్రాఫికింగ్, ఆర్గాన్ ట్రాఫికింగ్ , డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్లు గతంలో ఆరోపణలు వచ్చినవి నిజం కాదా ? ఎదురు తిరుగుతే ఇలాంటి సంఘటనలు జరుగుతాయని హెచ్చరికగా ఈ హత్యను చేశారా ? హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించడం ముందస్తు ప్లాన్ లో భాగమే కాదా?

4, శిక్ష విధించాల్సిన ప్రిన్సిపాల్ కు వేరే చోట పోస్టింగ్ ఇవ్వడం వెనుక అసలు రహస్యం ఏమిటి . ఎవరికి భయపడి రీ పోస్టింగ్ ఇచ్చారు. ఎక్కడ రహస్యలు బయట పెడతాడరనే భయంతో అలా చేశారా ?

5, సీఎం మమతా బెనర్జీకి తెలిసిన వెంటనే సరియైన చర్యలు తీసుకోకుండా మీ నుంచి కాకపోతే సీబీఐ కి ఇస్తానని అనడం వెనుకాల రహస్యం ఏమిటి ?

6, కేసును చేదించి, రక్షించాల్సిన సాక్షాత్తు ఆ రాష్ట్ర ప్రజల బాస్ మమత బెనర్జీ , ముఖ్యమంత్రి ఆమెనే , హోం శాఖ మంత్రి ఆమెనే, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడ ఆమెనే, దొంగ దొంగ అన్నట్లుగా సీఎం హోదాలో నిస్సహాయంగా, ప్లే కార్డులు పట్టుకొని ధర్నా చేయడం వెనుక మమత బెనర్జీ ఎవరికి భయపడుతున్నట్లు ? ప్రపంచంలో ఎక్కడైనా ఇలా జరిగిందా ?

7, ఆధునిక టెక్నాలజీ ఉన్న నేటి తరంలో 24 గంటల్లో సూనయాసంగా చేదించాల్సిన కేసు అలస్యం కావడానికి అసలు కారణం ఎవరు ? పెద్దల తలలు బయట పడతాయనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థలు శకుని పాత్ర పోషిస్తున్నది నిజం కాదా ?

8,, ఆర్జీకర్ కాలేజీలో, హాస్పటల్లో డ్రగ్స్ సరఫరా జరుగుతున్నది నిజం కాదా ? ఇందులో కొందరి రాజకీయ పెద్ద తలలు ఉన్నది నిజం కాదా ? చివరికి కొందరి వైద్య సిబ్బంది హస్తము ఉన్నది కూడ నిజం కాదా ?

9, ఈ సంఘటన వెనుక పెద్ద రాజకీయ నాయకులు ఉండటం, వారికి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండటము, ప్రభుత్వానికే ముప్పు తెచ్చే విధంగా ఉండటం తో కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది నిజం కాదా?

10, ఆసుపత్రిలోని అత్యవసర భవనంలోని ఛాతీ విభాగం మూడో అంతస్తు సెమినార్ హాల్ సమీపంలో పునర్నిర్మాణం చేయటం అంటే కీలకమైన సాక్ష్యాలను దాచిపెట్టడం కొరకే కదా ?

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img