Thursday, March 12, 2026

Does the World Need American Dominance ?

ప్రపంచ రాజకీయాలలో ఒక కీలక ప్రశ్న గత కొన్ని దశాబ్దాలుగా చర్చకు వస్తోంది, ప్రపంచానికి ఒకే పెద్ద శక్తి అవసరమా? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన దేశంగా ఎదిగింది United States. ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, స్వేచ్ఛ అనే విలువలను ప్రచారం చేస్తూ ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తోంది, కానీ అదే సమయంలో అనేక దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, ప్రభుత్వాలను మార్చడం, సైనిక దాడులు చేయడం వంటి చర్యలపై తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. ప్రత్యేకంగా Donald Trump వంటి నాయకుల కాలంలో ఈ చర్చ మరింత గట్టిగా వినిపించింది.
ఈ నేపథ్యంలో ప్రపంచానికి అమెరికా ఆధిపత్యం అవసరమా అనే ప్రశ్నను చరిత్ర, గణాంకాలు, రాజకీయ విశ్లేషణ మరియు మానసిక కోణంలో పరిశీలించడం అవసరం.

అమెరికా ఆధిపత్యం ఎలా ఏర్పడింది ?

ప్రపంచ రాజకీయాలలో United States ఆధిపత్యం ఒక్కరోజులో ఏర్పడలేదు. ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన రాజకీయ, ఆర్థిక, సైనిక పరిణామాల ఫలితం. 1945లో జరిగిన World War II ప్రపంచ శక్తి సమీకరణాన్ని పూర్తిగా మార్చింది. యుద్ధం ముగిసేసరికి యూరప్ దేశాలు తీవ్రంగా బలహీనపడ్డాయి. జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. కానీ అమెరికా మాత్రం యుద్ధం వల్ల పెద్దగా నష్టపోకుండా బలంగా ఎదిగింది. యుద్ధం తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి అమెరికా కీలక పాత్ర పోషించింది. మార్షల్ ప్లాన్ ద్వారా యూరప్ దేశాలకు భారీ ఆర్థిక సహాయం అందించింది. ఈ చర్యతో యూరప్ దేశాలు అమెరికాతో మరింత దగ్గరయ్యాయి. అదే సమయంలో ప్రపంచ వాణిజ్యంలో డాలర్ ప్రధాన కరెన్సీగా మారింది.

ఇదే సమయంలో అమెరికా మరియు సోవియట్ యూనియన్ మధ్య Cold War ప్రారంభమైంది. ఈ పోటీ ప్రపంచ రాజకీయాలను రెండు శక్తి బ్లాకులుగా విభజించింది. అమెరికా తన మిత్రదేశాలతో కలిసి NATO వంటి సైనిక కూటములను ఏర్పాటు చేసింది. 1991లో సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత ప్రపంచంలో ఒక్క పెద్ద శక్తిగా అమెరికా మిగిలింది. ఆ తర్వాత ప్రపంచ రాజకీయాల్లో “అమెరికా ఆధిపత్యం” అనే వ్యవస్థ ఏర్పడింది. అసలు అమెరికా బలానికి కారణాలు ఏంటో తెలుసా ? ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అత్యాధునిక సైనిక శక్తి, డాలర్ ఆధిపత్యం, ప్రపంచ మీడియా ప్రభావం, అంతర్జాతీయ సంస్థలపై పెత్తనం లాంటివి

అమెరికా జోక్యం – చరిత్రలోని సంఘటనలు :

ప్రపంచ చరిత్రలో అనేక సందర్భాల్లో అమెరికా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇతర దేశాల రాజకీయాల్లో జోక్యం చేసుకుందని విమర్శలు ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్య సంఘటనలు, 1953 సంవత్సరంలో ఇరాన్. ప్రభుత్వ మార్పు, 1973 సం:లో చిలీ దేశం లో సైనిక తిరుగుబాటు, 2003 సం:లో ఇరాక్ దేశం పై సైనిక దాడి, 2011సం:లో లిబియా ప్రభుత్వ పతనం, ప్రత్యేకంగా Iraq War ప్రపంచవ్యాప్తంగా భారీ చర్చకు దారి తీసింది. వియత్నాం యుద్ధం లో సుమారుగా ~30 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, 20 సంవత్సరాల ఇరాక్ యుద్ధం లో ~2 లక్షలు మంది, 2003–2011 మధ్య కాలం లో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం మూలంగా ~2.4 లక్షలు పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు చాలా మీడియా సంస్థల అంచనాలు చెబుతున్నాయి.

అమెరికా సైనిక ప్రభావం :

ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశానికీ లేని స్థాయిలో అమెరికాకు విదేశీ సైనిక స్థావరాలు ఉన్నాయి. 80కిపైగా దేశాలలో అమెరికా సైనిక బేసులు, సుమారు 750 విదేశీ సైనిక స్థావరాలు, సంవత్సరానికి 800 బిలియన్ డాలర్ల రక్షణ ఖర్చులు (ప్రపంచంలో అత్యధికం), ఇది ప్రపంచ రక్షణ ఖర్చులో సుమారు 40%. యాక్టివ్ సైనికులు సుమారు 13 లక్షలు, రిజర్వ్ సైనికులు సుమారు 8 లక్షలు, అణ్వాయుధాలు ~5,200, 13,000 పైగా యుద్ధ విమానాలు, ట్యాంకులు 6,000 పైగా , ఈ స్థాయి సైనిక శక్తి ప్రపంచంలో మరే దేశానికీ లేదు.1.7 లక్షలకిపైగా అమెరికా సైనికులు విదేశాలలో విధులు నిర్వహిస్తున్నారు. అమెరికా నేవీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది.,11 ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్స్, 70కి పైగా అణు జలాంతర్గాములు, 490 పైగా యుద్ధ నౌకలు, ఇది సముద్రాలపై అమెరికాకు భారీ ఆధిపత్యం ఇస్తుంది. ప్రపంచంలో అత్యాధునిక వైమానిక శక్తి అమెరికాదే. ప్రధాన యుద్ధ విమానాలు,F-35, F-22 మరియు B-2 stealth bomber లు, ఈ విమానాలు ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికతతో రూపొందించబడ్డాయి, అమెరికా ప్రపంచంలో అణ్వాయుధ శక్తిలో ముందున్న దేశాలలో ఒకటి.భూమి ఆధారిత మిస్సైళ్లు,జలాంతర్గాముల నుండి ప్రయోగించే మిస్సైళ్లు, బాంబర్ విమానాలు. ఈ కారణంగా అమెరికా ప్రపంచ రాజకీయాల్లో భారీ ప్రభావం కలిగిన దేశంగా ఉంది.

ప్రపంచ దేశాలు ఎందుకు ప్రతిఘటించలేవు ?

Donald Trump పాలనలో “America First” అనే నినాదం ప్రధానంగా వినిపించింది.
ఆ కాలంలో జరిగిన కొన్ని నిర్ణయాలు ముఖ్యంగా ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం, చైనాతో ట్రేడ్ వార్, నాటో దేశాలపై ఒత్తిడిలు, మధ్యప్రాచ్యంలో దూకుడు విదేశాంగ విధానం, ఈ నిర్ణయాలు ప్రపంచ రాజకీయాల్లో వివాదానికి కారణమయ్యాయి.అమెరికా చర్యలను అనేక దేశాలు విమర్శించినప్పటికీ, ప్రత్యక్షంగా ఎదిరించడానికి చాలా దేశాలు ముందుకు రావడం లేదు. ఎందుకంటే డాలర్ ఆధిపత్యం, ఆర్థిక ఆధారపడటం, సైనిక భద్రత, వాణిజ్య సంబంధాలు, ప్రపంచ వాణిజ్యంలో డాలర్ కీలక పాత్ర పోషించడం వల్ల అమెరికాకు ఆర్థిక ప్రభావం ఉంది. ఒకవైపు తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పడం, మరోవైపు వ్యూహాత్మక ప్రయోజనాల కోసం కొన్ని దేశాలతో కలిసి పనిచేయడం. ఉదాహరణకు Pakistanతో అమెరికా సంబంధాలు చాలా చర్చకు దారి తీసాయి. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ సమయంలో అమెరికా పాకిస్తాన్ సహకారం తీసుకుంది.

ప్రపంచానికి ఆధిపత్యం అవసరమా?

ఈ ప్రశ్నకు ఒకే సమాధానం లేదు. కొందరి అభిప్రాయం ప్రకారం అమెరికా ఆధిపత్యం వల్ల ప్రపంచ వాణిజ్యం స్థిరంగా ఉంది. అంతర్జాతీయ సంస్థలు పనిచేస్తున్నాయి. భద్రతా వ్యవస్థ కొనసాగుతోంది, మరో అభిప్రాయం, అమెరికా ఆధిపత్యం వల్ల యుద్ధాలు పెరిగాయి, ఇతర దేశాల సార్వభౌమత్వం దెబ్బతింది,ప్రపంచ రాజకీయాలు అసమానంగా మారాయి, భవిష్యత్తులో ప్రపంచానికి అవసరమైంది, సమతుల్య ప్రపంచ వ్యవస్థ. అంతర్జాతీయ చట్టాలకు గౌరవం, యుద్ధాల కంటే సంభాషణలు, పరస్పర గౌరవం ,సమాన అవకాశాలు కల్గి ఉండాలి. ప్రపంచ రాజకీయాలు ఒకే దేశం ఆధిపత్యంలో కొనసాగడం చాలా కాలం సాధ్యం కాదు. ఇప్పటికే ప్రపంచం మెల్లగా బహుళ శక్తుల ప్రపంచం వైపు కదులుతోంది. అమెరికా, చైనా, రష్యా, భారత్ వంటి దేశాలు కలిసి పనిచేస్తేనే ప్రపంచంలో నిజమైన శాంతి సాధ్యమవుతుంది.

డాక్టర్. కేశవులు భాషవత్తిని. ఎండీ. ( సైకియాట్రీ).
చైర్మన్: తెలంగాణ మేధావుల సంఘం.
85010 61659.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest News

- Advertisement -spot_img