కార్పొరేషన్ మేయర్ పై MP అరవింద్ నిర్ణయం షాకింగ్ , అభినందనలు తెలిపిన మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ కేశవులు…
నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల అనంతరం మేయర్ పదవి విషయంలో చోటుచేసుకున్న పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందిస్తున్నాయి. అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ ఒంటరిగా మేయర్ పదవిని సాధించే మెజారిటీ లేనందున, స్థానిక ఎంపీ డి. అరవింద్ గారు హుందాగా వ్యవహరించి మేయర్ సీటును కైవశం చేసుకునే ప్రయత్నం చేయకపోవడం అభినందనీయమైన విషయం.
ప్రజాస్వామ్యంలో సంఖ్యా బలం మాత్రమే కాక, నైతిక బలం కూడా సమానంగా అవసరం. డబ్బుల ప్రలోభాలు, ఓట్ల కొనుగోలు వంటి అనైతిక చర్యలకు దూరంగా ఉండి ప్రజల తీర్పును గౌరవించడం రాజకీయ సంస్కృతికి మంచి ఉదాహరణగా నిలుస్తుంది. ఇది భవిష్యత్ తరాలకు కూడా ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం ఇస్తుంది.
తెలంగాణ మేధావుల సంఘం తరఫున ఈ హుందాతన నిర్ణయాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడే ఇటువంటి చర్యలు కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాము.
డా. బి. కేశవులు, ఎం.డి. సైకియాట్రి.
చైర్మన్: తెలంగాణ మేధావుల సంఘం.
85010 61659.







